తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandana Says She Did Not Watch Kantara Movie Yet

Rashmika Reaction on Kantara Movie: కాంతార చిత్రంపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పిందంటే?

01 November 2022, 10:26 IST

    • Rashmika Reaction on Kantara Movie: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఇటీవల ముంబయి విమానాశ్రయంలో సందడి చేసంది. ఇందులో భాగంగా అక్కడ ఆమెతో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన అభిమాని ఆమెను కాంతార సినిమా గురించి ప్రశ్నించాడు. ఇందుకు రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
రష్మికా మందన్నా
రష్మికా మందన్నా (PTI)

రష్మికా మందన్నా

Rashmika Reaction on Kantara Movie: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెకేషన్‌కు వెళ్తూ చిల్ అవుతోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవుల్లో పర్యటించింది. అయితే వీరిద్దరూ కలిసి వెళ్లనప్పటికీ.. కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మికా మందన్నా ముంబయి ఎయిర్‌పోర్టులో సందడి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

దీంతో అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కొంతమంది ఆమెతో సెల్ఫీలు దిగారు. అయితే రష్మిక మాత్రం ఎలాంటి ఇబ్బందిని ముఖంలో చూపించకుండా వారితో కలిసి ఆనందంగా సెల్ఫీలకు ఫోజిచ్చింది. ఇందులో భాగంగా రష్మికతో ఓ అభిమాని కన్నడలో సంభాషించారు. కాంతార సినిమా చూశారా అని అడిగారు. ఇందుకు ఆమె ఇంకా మొదట స్పందించలేదు. మళ్లీ అదే ప్రశ్న అడగ్గా.. ఇంకా చూడలేదంటూ సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా ఆ సంభాషణ కొనసాగించకుండా వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లకు ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. కాంతార చిత్రానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన కిరిక్ పార్టీతోనే ఇండస్ట్రీలోకి రష్మిక ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. దీంతో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ మెరిసింది. అమితాబ్ బచ్చన్‌తో చేసిన గుడ్‌బై చిత్రం ఈ నెలలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.