తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr Centenary Award: మ‌హిళాసాధికారిక‌త‌కు నిదర్శనం విజ‌య‌ల‌క్ష్మి.. అలనాటి నటికి ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం

NTR Centenary Award: మ‌హిళాసాధికారిక‌త‌కు నిదర్శనం విజ‌య‌ల‌క్ష్మి.. అలనాటి నటికి ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం

01 November 2022, 7:41 IST

    • NTR Centenary Award: సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మీకి ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాన్ని అందజేశారు నందమూరి బాలకృష్ణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమెను ఈ గౌరవాన్ని అందజేశారు.
విజయలక్ష్మీకి అవార్డు అందజేస్తున్న బాలకృష్ణ
విజయలక్ష్మీకి అవార్డు అందజేస్తున్న బాలకృష్ణ

విజయలక్ష్మీకి అవార్డు అందజేస్తున్న బాలకృష్ణ

NTR Centenary Award: ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా.. సీనియర్ ఎల్ విజయలక్ష్మీకి మహానటుడి శత జయంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు హైద‌రాబాద్‌లో ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అభినంద‌న‌లు తెలపాల‌ని బాల‌కృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎఫ్‌.ఎన్‌.సి.సి.లో ఆమెకు గౌర‌వ స‌త్కారం చేశారు. ఎల్.విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు.

ట్రెండింగ్ వార్తలు

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అనంత‌రం నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ, "శ‌క‌పురుషుడి శ‌తాబ్డి పుర‌స్కార గ్రహీత ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారికి శిర‌స్సు వ‌చ్చి వంద‌నాలు స‌మ‌ర్పిస్తున్నాను. 60 ద‌శ‌కంలో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ముందుకు న‌డిపిన‌ అతిర‌థులు నిర్మించిన చిత్రాల్లో ఆమె న‌ట‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. ఇక చ‌రిత్ర పుట‌ల్లోకి వెళితే ఎర్నాకుళంలో పెట్టి నాట్యం నేర్చుకుని 59 నుంచి 69వ‌ర‌కు ప‌దేళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం సినిమారంగంలో చేశారు. వంద‌కుపైగా సినిమాల్లో న‌టిస్తే అందులో 60కి పైగా నాన్న‌గారితో న‌టించారు. నాట్యంలో ప‌లువురు న‌టీమ‌ణులు వున్నా, ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, క‌థాక‌ళి, జావ‌లి వంటి ఎన్నో నాట్యాలు ప్ర‌ద‌ర్శించారు. అలా క‌ళామ‌త‌ల్లి సేవ చేశారు. ముఖ్యంగా న‌టీన‌టులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్ర‌యాణం ఆగిపోతే ఒంట‌రిత‌నానికి గురికావ‌డం స‌హ‌జం. కానీ ఆమె నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చ‌దివి వ‌ర్జీనియా యూనిర్శిటీలో బ‌డ్జెట్ మేనేజ‌ర్‌గా వుండ‌డం చాలా విశేషం. ఆమె మ‌హిళా సాధికారిక‌త‌కు ప్ర‌తీక‌. ఆమె ఎక్కిన‌ మెట్లును భావిత‌రాలు ఆద‌ర్శంగా తీసుకోవాలి." అని అన్నారు.

ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మీ మాట్లాడుతూ.. "ఎంతో అభిమానంతో న‌న్ను పిలిపించి గౌర‌వించ‌డం చూస్తుంటే క‌ళ్ళు చెమ‌ర్తున్నాయి. మీరంతా చాలా ద‌య‌తో, ప్రేమ‌తో న‌న్ను ఇక్క‌డికి ర‌ప్పించినందుకు బాల‌కృష్ణ‌గారికి ఆల‌పాటి రాజా, బుర్ర‌సాయిమాద‌శ్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిన్న‌త‌నంనుంచి రామారావుగారిని ఆద‌ర్శంగా తీసుకునేదానిని. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు మొద‌ట చాలా భ‌య‌మేసేది. పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు చాలా విలువ‌లు నేర్చుకున్నాను. సినిమాలు అయ్యాక నేను ఎడ్యుకేష‌న్ చేశానంటే ఎన్‌.టి.ఆర్‌.స్పూర్తి వ‌ల్లే జ‌రిగింది." అని ఎమోషనల్ అయ్యారు.

డి. సురేష్‌బాబు షీల్డును అంద‌జేస్తూ.."1964లో రాముడు భీముడు మా బేన‌ర్‌లో నిర్మించిన సినిమాలో విజ‌య‌ల‌క్ష్మీ న‌టించారు. న‌టిగా 10 ఏళ్ళ‌లో 100 సినిమాలు చేయ‌డం పెద్ద గౌర‌వంగా భావించి ఇప్పుడు యూనివ‌ర్శిటీలో బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం చాలా విశేషమని" స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తమ్మారెడ్డి భరద్వాజ, వీవీఎస్ చౌదరి, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కాజ సూర్య‌నారాయ‌ణ‌, ప్ర‌స‌న్న‌కుమార్‌, బ‌సిరెడ్డి, రామ‌స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం