Balakrishna - Parasuram Movie: స‌ర్కారువారి పాట ద‌ర్శ‌కుడితో బాల‌కృష్ణ సినిమా-balakrishna to team up with sarkaru vaari paata director parasuram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna - Parasuram Movie: స‌ర్కారువారి పాట ద‌ర్శ‌కుడితో బాల‌కృష్ణ సినిమా

Balakrishna - Parasuram Movie: స‌ర్కారువారి పాట ద‌ర్శ‌కుడితో బాల‌కృష్ణ సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Oct 31, 2022 09:42 AM IST

Balakrishna Parasuram Movie: అగ్ర హీరో బాల‌కృష్ణ‌తో స‌ర్కారు వారి పాట ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఊర్వ‌శివో రాక్ష‌సివో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అద్భుత‌మైన క‌థ‌తో బాల‌కృష్ణ‌ను త్వ‌ర‌లో క‌ల‌వ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ వెల్ల‌డించాడు.

బాల‌కృష్ణ‌
బాల‌కృష్ణ‌

Balakrishna Parasuram Movie: టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. బాల‌కృష్ణ‌తో స‌ర్కారువారి పాట ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆదివారం జ‌రిగిన ఊర్వ‌శివో రాక్ష‌సివో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్న‌ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ వెల్ల‌డించారు.

ఈ ఈవెంట్‌లో జై బాల‌య్య అనే డైలాగ్‌తో స్పీచ్ మొద‌లుపెట్టారు ప‌ర‌శురామ్‌. ఓ అద్భుత‌మైన క‌థ‌తో త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌ను క‌ల‌వ‌బోతున్నాన‌ని ప‌ర‌శురామ్ అన్నాడు. ఈ విష‌యం అల్లు అర‌వింద్‌కు తెలుసుస‌ని చెప్పాడు. అయితే క‌థ‌, జోన‌ర్ ఏమిట‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ప‌ర‌శురామ్ అనౌన్స్‌మెంట్‌తో బాల‌కృష్ణ అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బాల‌కృష్ణ హీరోగా న‌టించ‌నున్న 109వ సినిమా ఇదేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో వీర‌సింహారెడ్డి సినిమా చేస్తున్నారు బాల‌కృష్ణ‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

అలాగే అనిల్‌రావిపూడితో 108వ సినిమా చేస్తున్నారు బాల‌కృష్ణ‌. ఈ సినిమా షూటింగ్ మొద‌లుకాక‌ముందే ప‌ర‌శురామ్‌తో సినిమాకు బాల‌కృష్ణ‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు స‌ర్కారువారి పాట స‌క్సెస్ అనంత‌రం నాగ‌చైత‌న్య‌తో ఓ ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ ప్ర‌క‌టించాడు.

నాగేశ్వరరావు వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది. అనిల్‌రావిపూడి తో బాల‌కృష్ణ చేయ‌నున్న సినిమా పూర్త‌యిన త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point