Kantara Telugu Collection: తెలుగులో విక్ర‌మ్ క‌లెక్ష‌న్స్ బీట్ చేసిన కాంతారా - రెండో డ‌బ్బింగ్ సినిమాగా రికార్డ్‌-kantara becomes second highest grossing telugu dubbing film in 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Becomes Second Highest Grossing Telugu Dubbing Film In 2022

Kantara Telugu Collection: తెలుగులో విక్ర‌మ్ క‌లెక్ష‌న్స్ బీట్ చేసిన కాంతారా - రెండో డ‌బ్బింగ్ సినిమాగా రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 30, 2022 10:26 AM IST

Kantara Telugu Collection: కాంతారా సినిమా తెలుగులో రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ డ‌బ్బింగ్ సినిమాల్లో సెకండ్‌ప్లేస్‌లో కాంతారా నిలిచింది.

 రిష‌బ్‌శెట్టి
రిష‌బ్‌శెట్టి

Kantara Telugu Collection: తెలుగులో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన కాంతారా చిత్రం అద్భుత‌మైన వ‌సూళ్ల‌తో అద‌ర‌గొడుతోంది. మూడు వారాల్లోనే ఈ సినిమా యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌కు చేరువై నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను మిగిల్చింది. ఈ క్ర‌మంలో తెలుగులో ఈ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌లో కాంతారా నిలిచింది.

ఈ లిస్ట్‌లో 78 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో య‌శ్ కేజీఎఫ్‌-2 (KGF 2) ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ 43 కోట్ల‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. తాజాగా శుక్ర‌వారం నాటి వ‌సూళ్ల‌తో విక్ర‌మ్ రికార్డ్‌ను కాంతారా అధిగ‌మించింది. 45 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెకండ్ ప్లేస్‌లో కాంతారా నిలిచిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాటితో ఈ సినిమా యాభై కోట్ల మార్కును దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంటున్నారు.

రెండు కోట్ల‌కు ఈ సినిమా తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల‌ను నిర్మాత అల్లు అర‌వింద్ సొంతం చేసుకున్నారు. రిలీజ్ రోజే ఐదు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి మొద‌టి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. కాంతారా లో హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు రిష‌బ్‌శెట్టి (Rishab shetty). భూత‌కోళ అనే ట్రెడిష‌న‌ల్ క‌ళ‌కు రివేంజ్ డ్రామాను జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

క‌థ‌, విజువ‌ల్స్‌తో పాటు రిష‌బ్‌శెట్టి యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా సినీ ప్ర‌ముఖులంద‌రూ కాంతారాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌లే రిష‌బ్‌శెట్టిని ప్ర‌త్యేకంగా త‌న ఇంటికి పిలిపించుకొని అభినందించారు ర‌జ‌నీకాంత్‌. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రెండు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

IPL_Entry_Point