తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K Release Date : ప్రాజెక్ట్ K అనుకున్న తేదీకి విడుదల కష్టమే.. కారణం అమితాబ్ బచ్చన్

Project K Release Date : ప్రాజెక్ట్ K అనుకున్న తేదీకి విడుదల కష్టమే.. కారణం అమితాబ్ బచ్చన్

Anand Sai HT Telugu

11 May 2023, 8:38 IST

    • Project K Releaae Date : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంకా టైమ్ తీసుకునేలా ఉంది.
ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

ప్రభాస్

ప్రభాస్, దీపికా పదుకొనే(prabhas deepika padukone film) జంటగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ లెక్క.. రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్(amitabh bachchan) ఇటీవల గాయపడ్డాడు. మెల్లగా కోలుకుంటున్నాడు. ఆయన కోలుకోవడం ఆలస్యమవడంతో సినిమా పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో ' ప్రాజెక్ట్ K ' సినిమా అనుకున్న తేదీకి విడుదల కాలేదని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

'ప్రాజెక్ట్ కె' షూటింగ్(Project K Shooting) సమయంలో అమితాబ్ బచ్చన్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు అమితాబ్ మెల్లగా కోలుకుంటున్నాడు. ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అమితాబ్ బచ్చన్ వయసు 80 ఏళ్లు. ఈ వయసులోనూ నటనతో బిజీగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యంపై టీమ్ ఎక్కువ శ్రద్ధ చూపుతోంది.

అమితాబ్ బచ్చన్ కాస్త కోలుకున్నప్పటికీ, కొంత విశ్రాంతి అవసరం. ఇలాంటప్పుడు షూటింగ్ కు రావాలని ఒత్తిడి చేస్తే మళ్లీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ ముందుకు తీసుకెళ్లినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మాత భావిస్తున్నాడట. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్(nag ashwin) ఈ విషయంలో ఆలోచల్లో పడ్డాడట.

'బాహుబలి 2'(Bahubali 2) తర్వాత ప్రభాస్‌కి అనుకున్నంత విజయం దక్కలేదు. అందుకే సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. జూన్ 16న 'ఆదిపురుష్'(Adipurush) సినిమా విడుదలవుతోంది. దీని తర్వాత సెప్టెంబర్‌లో 'సాలార్'(salaar) రానుంది. ఈ విడుదల తర్వాత 'ప్రాజెక్ట్ కె' విడుదల కానుంది.

'ప్రాజెక్ట్ కె' చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రాజెక్ట్ కే ఫాంటసీ డ్రామా జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో సరికొత్త రూపంల కనిపించనున్నారు. అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు దీపికా పదుకొణె 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. డార్లింగ్‌తో ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటిస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఆధునిక అవతారం గురించి ఈ సినిమా ఉంటుందని అశ్విని దత్ గతంలో చెప్పారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.