తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya On Tattoo: సమంతను గుర్తు చేసే ఆ టాటూను నాగ చైతన్య తీసేస్తాడా?

Naga Chaitanya on Tattoo: సమంతను గుర్తు చేసే ఆ టాటూను నాగ చైతన్య తీసేస్తాడా?

HT Telugu Desk HT Telugu

09 August 2022, 21:40 IST

    • Naga Chaitanya on Tattoo: సమంతతో విడాకులపై ఈ మధ్యే నాగచైతన్య స్పందించిన విషయం తెలుసు కదా. అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో తన చేతిపై ఉన్న టాటూ గురించి కూడా అతడు చెప్పాడు.
నాగ చైతన్య చేతిపై ఉన్న టాటూ ఇదే
నాగ చైతన్య చేతిపై ఉన్న టాటూ ఇదే

నాగ చైతన్య చేతిపై ఉన్న టాటూ ఇదే

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగ చైతన్య చేతిపై ఉన్న టాటూను ఎప్పుడైనా చూశారా? మామూలుగా చూస్తే ఈ టాటూ ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది మోర్స్‌ కోడ్‌లో ఉన్న ఓ తేదీ. ఆ తేదీ మరేదో కాదు.. సమంతను తాను పెళ్లి చేసుకున్న రోజు. ఈ విషయాన్ని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించాడు. అంతేకాదు ఈ విషయంలో అభిమానులు ఎవరూ తనను ఫాలో కావద్దని కూడా అతడు చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

మరి విడాకుల తర్వాత ఈ టాటూని తీసేయాలని అనిపించలేదా అని అడిగితే.. అలా ఎప్పుడూ అనుకోలేదని, ఈ టాటూ తీసే ఉద్దేశం కూడా తనకు లేదని కూడా చైతూ చెప్పాడు. బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాటూ గురించి అతడు కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పాడు. సమంతను 2017, అక్టోబర్‌ 6న పెళ్లి చేసుకున్న చైతన్య ఆ తేదీనే టాటూగా వేయించుకున్నాడు.

"ఈ మధ్య నా పేరులాంటి టాటూలు వేయించుకున్న కొందరు ఫ్యాన్స్‌ను కలిశాను. అందులో నాలా టాటూ వేయించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇది మీరు ఫాలో కావాల్సిన టాటూ కాదు. ఎందుకంటే ఇది నాకు పెళ్లి జరిగిన రోజు. అందుకే దానిని ఒంటిపై వేయించుకోవద్దని ఫ్యాన్స్‌ను కోరుతున్నా. వాళ్లు ఇలాంటి టాటూ వేయించుకున్నప్పుడు బాధగా ఉంటుంది. పరిస్థితులు మారుతూ ఉంటాయి.. టాటూనూ మార్చాలి అన్నట్లుగా అనిపిస్తుంది" అని నాగ చైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మరి నిజంగా ఆ టాటూని మార్చాలని ఎప్పుడైనా అనిపించిందా అని అడిగితే.. తానెప్పుడూ అలా ఆలోచించలేదని చెప్పాడు. ఒకవేళ సమంతను మళ్లీ కలిస్తే ఏం చేస్తావని అడిగితే.. హాయ్‌ చెప్పి ఓ హగ్‌ ఇస్తా అని అన్నాడు. అటు సమంత కూడా ఇలాంటి టాటూతోపాటు చై అనే టాటూను కూడా వేయించుకుంది. అంతేకాదు తమ తొలి సినిమా ఏ మాయ చేసావేలోని తొలి అక్షరాలు వైఎంసీ అని కూడా ఓ టాటూ ఆమె ఒంటిపై ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.