Naga Chaitanya: విని విని బోర్ కొట్టేసింది.. సమంతాతో లింక్ ఇక ఆపండి.. చై స్పష్టం-naga chaitanya feel bored of being linked samantha after divorce ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: విని విని బోర్ కొట్టేసింది.. సమంతాతో లింక్ ఇక ఆపండి.. చై స్పష్టం

Naga Chaitanya: విని విని బోర్ కొట్టేసింది.. సమంతాతో లింక్ ఇక ఆపండి.. చై స్పష్టం

Maragani Govardhan HT Telugu
Aug 05, 2022 04:00 PM IST

నాగచైతన్య-సామ్ మధ్య విడాకులు జరిగి చాలా కాలమైనప్పటికీ ప్రజలు ఇంకా వారి గురించే మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై చై స్పందించారు. ఇంకా ఎంతకాలం ఇలా మాట్లాడుకుంటారని, విని విని బోర్ కొడుతుందని స్పష్టం చేశారు.

<p>నాగచైతన్య&nbsp;</p>
నాగచైతన్య (Twitter)

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు 10 నెలల కావస్తున్నా.. వీరికి సంబంధించిన వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. నిశ్శబ్దంగా విడాకులు తీసుకున్న వీరిద్దరూ అనంతరం ఒకరి గురించి మరొకరు కూడా ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్‌ షోలో సామ్ తొలిసారిగా నోరు విప్పింది. తాము విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని వివరించింది. అనంతరం చై కూడా ఈ విషయంపై స్పందించాడు. ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చడ్ఢా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్‌తో సంబంధం, విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామ్‌తో లింకులు ఇకనైనా ఆపాలని, విని విని బోర్ కొడుతుందని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

"మేమిద్దరం బయటకు వచ్చాం. అంతేకాకుండా విడివిడిగా కొన్ని ప్రకటనలు చేశాం. విడిపోయినప్పటికీ ఇద్దరిపై అపారమైన గౌరవం ఉంది. ఆమె ఏం చేస్తుందో నేను ఎప్పుడూ చూస్తుంటాను. ఆమె పట్ల ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. మేము చేయాల్సిందేంటో చెప్పేశాం. అయితే ఇప్పుడు ఏం లేనప్పటికీ ఏదోకటి భర్తీ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాకు బోర్ కొట్టేసింది. మేము విడిపోయిన తర్వాత నా సినిమాలు మూడు విడుదలయ్యాయి. ఇంకా ఎంత కాలం ఆమెతో లింక్ చేస్తారు" అని నాగచైతన్య ప్రశ్నించారు.

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్‌లో లాల్ సింగ్ చడ్ఢా చిత్రంతో అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ హీరో. భారీ బడ్జెట్ చిత్రంలో చై తన అరంగేట్రాన్ని అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1994లో విడుదలైన హాలీవుడ్ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఇది విడుదల కానుంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం