Naga Chaitanya: నాగ చైతన్య ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడా?
సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా మారాడు నాగ చైతన్య. ఆ విడాకుల ఎపిసోడ్‌తో అతడు బాగానే డిస్టర్బ్ అయినట్లు కనిపించాడు. ఓవైపు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుండగా.. చై మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉంటున్నాడు.
నాగ చైతన్య, సమంత లవ్‌స్టోరీ, పెళ్లి, ఆ తర్వాత విడాకులు అన్నీ టాలీవుడ్‌లో ఓ పెద్ద సెన్సేషనే. ఏం మాయ చేసావే మూవీలో కలిసి నటించిన ఈ జంట.. ఆ తర్వాత జీవితంలోనూ ఒక్కటవుతారని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అక్కినేని కుటుంబ నట వారసుడు, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న నటి పెళ్లితో ఒక్కటవడం పెద్ద వార్తే. అయితే ఆ పెళ్లి కంటే కూడా విడాకులు మరింత మందిని దృష్టిని ఆకర్షించింది.
నాలుగేళ్ల పాటు కలిసున్న వీళ్లు గతేడాది విడిపోయిన తర్వాత సమంత షికార్లు, సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటు చై మాత్రం ఆమె అంత ఉల్లాసంగా లేకపోయినా తన షూటింగ్‌ల పనేదో చేసుకుంటున్నాడు. ఇక పెళ్లి విషయంలో మరో హీరోయిన్ జోలికి వెళ్లకూడదని అతడు నిర్ణయించుకున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా చై మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు మేజర్ మూవీతో తెలుగు వాళ్లకు దగ్గరైన తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల. ఈ ఇద్దరూ ఈ మధ్య చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం. జూబ్లీహీల్స్‌లో తాను కొత్తగా కడుతున్న ఇంట్లో చై, శోభిత కలిసి కనిపించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఈ ఇద్దరూ ఆ ఇంట్లో కొద్ది గంటలు గడిపిన తర్వాత ఒకే కారులో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తన కొత్త ఇంటిని మొత్తం ఆమెకు చైతన్య చూపించినట్లు చెబుతున్నారు. అంతేకాదు అంతకుముందు ఆమె తన మేజర్ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా శోభిత దిగిన హోటల్‌లోనే చై చాలాసార్లు కనిపించినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఆమె హైదరాబాద్‌లో ఉన్నప్పుడే తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది.
శోభితా దూళిపాళ్ల తెలుగమ్మాయే. ఆమె పుట్టింది గుంటూరు జిల్లా తెనాలిలో. విశాఖపట్నంలో పెరిగింది. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్ కోసం ముంబై వెళ్లింది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించి మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయింది. రామన్ రాఘవ్ 2.0, గూఢాచారి, లేటెస్ట్‌గా మేజర్ మూవీలలోనూ నటించింది.
సంబంధిత కథనం