తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Rest And Recharge Selfie Set Internet On Fire3

Mahesh Babu Rest and Recharge: హాయిగా రెస్ట్‌ తీసుకుంటున్న మహేష్‌ బాబు.. ఫొటో వైరల్‌

Hari Prasad S HT Telugu

20 September 2022, 19:37 IST

    • Mahesh Babu Rest and Recharge: హాయిగా రెస్ట్‌ తీసుకుంటూ కనిపించాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. రెస్ట్‌ అండ్‌ రీఛార్జ్‌ అంటూ అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో వైరల్‌ అవుతోంది.
మహేష్ బాబు షేర్ చేసిన సెల్ఫీ
మహేష్ బాబు షేర్ చేసిన సెల్ఫీ (mahesh Babu instagram)

మహేష్ బాబు షేర్ చేసిన సెల్ఫీ

Mahesh Babu Rest and Recharge: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చాలా బిజీగా గడుపుతాడు. వరుస షూటింగ్‌లు లేదంటే ఫ్యామిలీతో వెకేషన్లు. అన్నీ పక్కన పెట్టి కాసేపు హాయిగా రెస్ట్ తీసుకునే అవకాశం అతనికి చాలా అరుదుగా దక్కుతుంది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడలాంటి ఖాళీయే ఈ యువరాజుకు దొరికినట్లుంది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి- అనామికను కొట్టేంతపని చేసిన కనకం- ఇక పుట్టింటికే- పూల బొకేలో రాజ్ బిడ్డ రహస్యం

కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

Faria Abdullah: పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి సినిమా.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా

Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు

అందుకే ఇంట్లో హాయిగా సేదదీరుతూ కనిపించాడు. సోషల్‌ మీడియాలో తన ఫొటోలను పెద్దగా షేర్‌ చేసే అలవాటు లేని మహేష్‌.. ఇప్పుడు మాత్రం ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్‌ చేయడం విశేషం. ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ ప్రిన్స్‌.. ఈ సెల్ఫీలోనూ అదే లుక్‌లో కనిపించాడు. ఈ మధ్యే 47వ పుట్టిన రోజు జరుపుకున్న అతడు.. ఈ ఫొటోలో మాత్రం చాలా యంగ్‌ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపించాడు.

ఈ మధ్యే ఆపిల్‌ రిలీజ్‌ చేసిన ఐఫోన్‌ 14 ప్రొ మ్యాక్స్‌ మొబైల్‌ నుంచి అతడు ఈ సెల్ఫీ దిగడం విశేషం. రెస్ట్‌ అండ్‌ రీఛార్జ్‌ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్‌ చేసిన మహేష్‌.. #ChillNoons #iPhone14ProMax అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా యాడ్‌ చేశాడు. ఈ ఫొటో అప్పుడే తెగ వైరల్‌ అయింది. గంటల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి.

అతని భార్య నమ్రతతోపాటు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా ఈ ఫొటోపై కామెంట్‌ చేశారు. సింప్లీ లవ్‌ అంటూ నమ్రతా కొన్ని ఎమోజీలను పోస్ట్‌ చేయగా.. అటు వార్నర్‌ మాత్రం 'ఆన్‌ పాయింట్‌ మేట్‌' అంటూ కామెంట్‌ చేశాడు. అంటే ఎంతో స్టైలిష్‌గా ఉన్నావని చెప్పడం. ఈ సెల్ఫీలో మహేష్‌ బాబు లాంగ్‌ హెయిర్‌తోపాటు గడ్డంతో కనిపిస్తున్నాడు.

ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం మహేష్‌ బాబు ఈ కొత్త లుక్‌ కూడా ఈ మధ్య చాలా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అతని లుక్‌ తొలిసారి బయటకు రాగానే ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మహేష్‌ తన 28వ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి అతడు, ఖలేజాలాంటి హిట్స్‌ అందించగా.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానుంది.

మహేష్‌ బాబు ఈ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు. వారం కిందటే ఎస్‌ఎస్‌ఎంబీ28 షూటింగ్‌ ప్రారంభమైంది. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓ భారీ సెట్‌ కూడా వేశారు. ఈ సెట్స్‌లోని బిహైండ్‌ ద సీన్‌ వీడియోను కూడా మేకర్స్‌ ఇప్పటికే షేర్‌ చేశారు. ఈ మూవీలో మహేష్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో మూవీ తెరకెక్కుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.