తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

Gunti Soundarya HT Telugu

29 April 2024, 7:13 IST

    • Karthika deepam 2 serial april 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పారిజాతం దీపని ఇంట్లో నుంచి పంపించేందుకు ప్లాన్ వేస్తుంది. తప్పంతా దీప చేసింది అన్నట్టుగా జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. అటు కార్తీక్ ని జ్యోత్స్నతో నిజం చెప్పకుండా ఆపుతుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial april 29th episode: కారు డ్రైవ్ చేయలేనప్పుడు తనకు ఒక్క ఫోన్ చేయవచ్చు కదాని కార్తీక్ అంటాడు. ఫోన్ వచ్చిందని వెళ్లిపోయావ్ కదా. నువ్వు అలా వెళ్ళిపోవడం నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంత అవమానమో తెలుసా? నీమీద కోపంతోనే నేను తాగానని అంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

నేనంటే ఇష్టం లేదా?

కోపంతో మనుషులను చంపేస్తావా అంటాడు. నీకు ప్రేమ విలువ తెలుసా అంటే నీకు ప్రాణం విలువ తెలుసా అని తిడతాడు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబం అనాథ అవుతుంది. డబ్బులతో కూడా మనం చేసిన తప్పు సరిదిద్దుకోలేము. ఆ బాధ మన నీడ లాంటిది దానితో మనం ప్రయాణం చేయడం నరకం అంటాడు.

నీకు ముందే చెప్పాను కాల్ వస్తే వెళ్లిపోతానని అంటే రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే వదిలేసి వెళ్లిపోతావా అని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది. నీకు పార్టీలు అంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదా? నేను చిన్నప్పటి నుంచి బావ అనుకున్నా భర్త అనుకున్నా అది నిన్నే.

అంత ప్రేమ నేను నీ నుంచి కోరుకుంటాను కదా. మరి నేను కోరుకుంటున్న ప్రేమ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావని నిలదీస్తుంది. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావని అంటుంది. నువ్వు నాకు మరదలివే నాకు ఎలాంటి ఆశలు లేవని చెప్పేస్తాను తనే అర్థం చేసుకుంటుందని అనుకుంటాడు.

నిజం చెప్పబోయిన కార్తీక్

కార్తీక్ విషయం చెప్పబోతుంటే దీప గదిలోకి వస్తుంది. జ్యోత్స్న దీప మొహం కూడా చూడదు. నేను అలా నిజం చెప్పకుండా ఉండాల్సిందని దీప మాట్లాడుతుంటే జ్యోత్స్న కోపంగా వెళ్లిపొమ్మని అంటుంది. దీప తీసుకొచ్చిన పాల గ్లాసుని జ్యోత్స్న కోపంగా విసిరి కొట్టేస్తుంది. అది దీప ముందు పడుతుంది.

దీప అది క్లీన్ చేస్తుంటే కార్తీక్ వద్దని అంటాడు. మీరు జాలి చూపిస్తున్నారు అది నాకు అవసరం లేదని అంటుంది. మీరు నిజం చెప్పడం తప్పు కాదు కానీ అది జ్యోత్స్న అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుందని కార్తీక్ సంజాయిషీ ఇచ్చేందుకు చూస్తాడు. దీప రాకపోయి ఉంటే జ్యోత్స్నకి నిజం చెప్పేసే వాడినని అనుకుంటాడు.

దీపని ఇంట్లో నుంచి తరిమేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని పారిజాతం అనుకుంటాడు. కార్తీక్ కోపంగా పారు దగ్గరకు వచ్చి అరుస్తాడు. తప్పు చేసిన దాన్ని మందలించకుండా జ్యోత్స్నని ఎందుకు వెనకేసుకొస్తున్నావని అరుస్తాడు. జ్యోత్స్న నాకు మరదలు మాత్రమే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నువ్వు వెళ్ళి అందరితో చెప్తావా లేదంటే నన్ను అందరితో చెప్పమంటావా అంటాడు.

నీ మరదలిని చంపేస్తావా?

ఇంటి పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడతావ్ ఏంటని అంటుంది. పార్టీలో నేను వదిలేసి వచ్చానని తాగానని అంటుంది నా వల్లే ఇలా జరిగిందని చెప్తుంది. నాకు ఈ ఫీలింగ్ చాలా గిల్టీగా ఉంది. ఈ ఫీలింగ్ పోవాలంటే అందరికీ నిజం చెప్పాలి. నువ్వు చెప్పవు చెప్పలేవని తెలుసు అందుకే అందరితో నేనే చెప్తున్నానని నీకు చెప్పడానికి వచ్చాను వినాలని అనుకుంటే రా అంటాడు.

నీ మరదలిని నువ్వే చంపాలని అనుకుంటున్నావా అని పారు గట్టిగా అంటుంది. నువ్వు పార్టీలో లేవని మందు తాగింది, జీవితంలో లేవని తెలిస్తే విషం తాగుతుంది. అది ఎంత మొండిదో నీకు తెలుసు నువ్వంటే ఎంత ప్రేమ అనేది నీకు తెలుసు. అది అసలే బాధలో ఉంది. ఈ టైమ్ లో ఇది తెలిస్తే అది బతకదు.

జ్యోత్స్న బలం, బలహీనత రెండూ నువ్వే. ఈ ఇంటికి ఉన్న ఏకైక వారసురాలు. అందరం దాని మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం అని సెంటి మెంట్ డైలాగులు కొట్టి కార్తీక్ ని ఆపేస్తుంది. పారు మాటలు విని కార్తీక్ కూడా ఆగిపోతాడు. వీలైనంత త్వరగా నిజం చెప్పమని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్న మొండిది

పెళ్లి చేసుకొనని అన్నాను కానీ తనంటే ఇష్టం లేదని కాదు. తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను అనేసి వెళ్ళిపోతాడు. దాని జీవితం బాగుండాలంటే దాని జీవితంలో నువ్వు ఉండాలని పారిజాతం అనుకుంటుంది. జ్యోత్స్న మంచిది కానీ మొండిది ఒక్కగానొక్క కూతురు. పైగా ఆడపిల్ల అని అందరికీ గారాబం.

జ్యోత్స్న చిన్నపాటి అవమానాన్ని కూడా తట్టుకోలేదు. అనుకున్నది దక్కపోతే సహించలేదు. దానికి ప్రేమ కలిగితే అవతలి వాళ్ళు ఇవ్వకపోయిన చనువు తీసుకుంటుంది. దాని మనసు విరిగితే అందనంత దూరం పెడుతుంది. మొహం మీదే మాట్లాడుతుంది.

జ్యోత్స్నని మేము చిన్నపిల్లలానే అనుకుంటాం. దాని మాటలు పట్టించుకోవద్దని సుమిత్ర దీపకు చెప్తుంది. నేను చెప్పింది నిజమే కానీ దాని వల్ల తనకి అవమానం జరిగింది. నేను తనని అర్థం చేసుకున్నాను అందుకే క్షమాపణ చెప్పాను. తను అర్థం చేసుకోవానికి టైమ్ పడుతుందిలే అంటుంది.

దీప తప్పు లేదన్న జ్యోత్స్న

పారు జ్యోత్స్న దగ్గరకు వస్తుంది. నువ్వు అమాయకురాలివి కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళు అనుకుంటున్నావ్. అమ్మని కాపాడిందని ఆ తల్లీకూతుళ్లకు ఏమి లోటు లేకుండా చూసుకున్నావ్. కొంచెం అయినా విశ్వాసం ఉందా దానికి. అది నీ పరువు తీసింది.

అది నీ జోలికి వచ్చినందుకు దాన్ని ఏం చేస్తానో చూడు అంటుంది. ఇందులో తన తప్పు ఏముంది తాగింది నేను, కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసింది నేను. తను జస్ట్ నిజమే కదా చెప్పిందని జ్యోత్స్న అంటుంది. జరిగిన దానికి హర్ట్ అయ్యి నేను తన సారి అంగీకరించలేదు కానీ తను ఏం తప్పు చేసిందని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్న మనసు విరగ్గొట్టాలని పారు అనుకుంటుంది. దీప నోరు విప్పకపోయి ఉంటే తప్పు చేశావని నిజం పోలీసులకు తెలిసేది కాదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళే దానివి కాదు. దీప నోరు తెరవకపోతే మీరందరూ అవమానంతో తల దించుకుని వచ్చేదానివి కాదు. మీ అమ్మ దగ్గర నీ పరువు పోయేది కాదు.

రెచ్చగొట్టిన పారిజాతం

ఇంతకముందు నువ్వు బయటకు వెళ్తే మిస్ హైదరాబాద్ వచ్చింది అనేవాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళు మందు తాగి మనుషులను చంపేది వచ్చిందని అంటారు. పరువు ప్రాణం పోతే తిరిగిరావు. దీప నోరు విప్పకపోయి ఉంటే నీ పరువు పోయేది కాదు.

నీ ప్రాణంగా ప్రేమించే నీ బావ ఏమనుకుంటాడు. నీ బావ మనసు విరిగిపోతే అసలు నిన్ను పెళ్లి చేసుకోనని అంటే ఏం చేస్తావని అనేసరికి జ్యోత్స్న ఇక ఆపు అని అంటుంది. ఇవన్నీ ఒక మనిషి నోరు విప్పడం వల్లే వచ్చిందని అర్థం అయ్యిందా అంటే అర్థం అయ్యింది కానీ నువ్వు గది నుంచి బయటకు వెళ్ళు అంటుంది.

పోవాల్సింది నేను కాదు ఆ దీప అది పోతేనే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు అని జ్యోత్స్నని పారు బాగా రెచ్చగొడుతుంది. కాంచన వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుకుంటారు. దీప నిజం చెప్పకుండా ఉండాల్సిందని కాంచన కూడా అంటుంది. కానీ కార్తీక్ మాత్రం దీప తప్పు లేదని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం ఎపిసోడ్ ముగిసింది.

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం