Monday Motivation : ప్రేమ కోసం చస్తామంటారు.. పెళ్లి అయ్యాక విడిపోతామంటారు-monday motivation ready to die for love before marriage but after marriage ready to take divorce in many relationships ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ప్రేమ కోసం చస్తామంటారు.. పెళ్లి అయ్యాక విడిపోతామంటారు

Monday Motivation : ప్రేమ కోసం చస్తామంటారు.. పెళ్లి అయ్యాక విడిపోతామంటారు

Anand Sai HT Telugu
Apr 29, 2024 05:00 AM IST

Monday Motivation : ఈ కాలంలో చాలామంది పెళ్లాయ్యాక విడిపోతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోతామంటారు.. కానీ పెళ్లి అయిన తర్వాత కలిసి ఉండలేరు.

సోమవారం మోటివేషన్
సోమవారం మోటివేషన్

ఇప్పటి తరంలో చాలా వరకు రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకుంటే ప్రేమ కోసం చనిపోవడానికి రెడీ.. అంటారు. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే ఇద్దరు కలిసి ఉంటే చచ్చిపోతామంటూ విడిపోతారు. ఇలాంటి రిలేషన్ షిప్ లో వీరి సమస్యకు కారణం ఏంటని చూస్తే.. చిన్న విషయం కూడా పెద్దదే అనే నిర్ణయానికి వస్తారు. కొన్ని సంబంధాలలో అవే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న వాటిని కూడా భరించలేరు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడుతుంది. దాంపత్యం బాగుండాలంటే చిన్న విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది.

చాలా మంది దంపతుల సమస్య ఏంటంటే అన్ని విషయాలు చెప్పలేం. ఎంత కోపం వచ్చినా పదాలు తక్కువగా వాడాలి. లేకుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ విషయంలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా తప్పులు చేస్తుంటారు. చాలా మంది మగవాళ్ళకి నేను చెప్పేది వినాలి అనే ఫీలింగ్ ఉంటుంది. మరికొందరు స్త్రీలు పురుషులను గౌరవించరు. మొదట్లో పెద్దగా ఇబ్బంది ఉండదు, క్రమంగా ఫిర్యాదు చేస్తుంటారు.

మన భాగస్వామిని, సన్నిహితులను దూషిస్తే, వారి గురించి చెడుగా మాట్లాడితే మన భాగస్వామి మనల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు. దాని కారణంగా దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి హృదయాన్ని గాయపరిచేలా ప్రవర్తించకండి. మీ జీవిత భాగస్వామి కుటుంబం గురించి చెడుగా మాట్లాడకండి.

మీ భాగస్వామి మీకు తాగవద్దని చెబుతారు. కానీ సాయంత్రమైతే తాగే ఇంటికి వస్తారు. ఇది గొడవను పెంచుతుంది. మీరు పదేపదే తప్పు చేస్తే, ఇది ఇద్దరు వ్యక్తులను భిన్నంగా చేయవచ్చు. ఒకసారి చేసిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

ఇది బంధానికి కూడా మంచిది కాదు. పాత సమస్యను తవ్వడం ఎండిన గాయాన్ని గోకడం లాంటిది. ఈ తప్పు చేయవద్దు. పాత సమస్యను అక్కడ వదిలేయాలి. లాగవద్దు. పాత విషయాలను తవ్వడం వల్ల సంబంధం రోజురోజుకు క్షీణిస్తుంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

జీవిత భాగస్వామిని గౌరవంగా చూసుకోవాలి. కానీ కొంతమంది ఒంటరిగా వదిలేస్తారు. గౌరవం ఇచ్చేది ఏముందిలే అనుకుంటారు. అలాంటి సంబంధం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించాలి, గౌరవం ఉన్న చోట మాత్రమే ప్రేమ ఉంటుంది.

ఈరోజు మహా శత్రువు సోషల్ మీడియా. అందులో సమయం గడపడం వల్ల దంపతుల మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. దీని వల్ల కుటుంబంలో సమస్యలు కూడా వస్తాయి. సోషల్ మీడియాలో మునిగిపోవడం లేదా సోషల్ మీడియాలో ఇంటి విషయాలను పోస్ట్ చేయడం వల్ల కుటుంబం నాశనం అవుతుంది. ఈ తప్పులు చేయవద్దు.

బంధం అంటే బాధ్యతగా జీవితాంతం కలిసి ఉండేది.. చిన్న విషయాలకే విడిపోయేది కాదు.

Whats_app_banner