Same sex partner killed: హోమో సెక్స్ భాగస్వామిని హత్య చేసిన యువకుడు
Same sex partner killed: తనతో కొన్నాళ్లుగా స్వలింగ సంపర్కంలో ఉన్న 16 ఏళ్ల బాలుడిని ఒక యువకుడు, తన స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. హత్యకు ముందు ఆ బాలుడిపై లైంగికంగా దాడి చేసినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.
Same sex partner killed: సేమ్ సెక్స్ రిలేషన్ గుజరాత్ లో ఒక బాలుడి ప్రాణం తీసింది. గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడితో కొన్నాళ్లుగా స్వలింగ సంపర్కం (same-sex relationship) లో ఉన్న 22 ఏళ్ల యువకుడు, తన మరో స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
సగం కాలిన స్థితిలో..
బాధిత బాలుడు శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు నిందితుడు, అతడి స్నేహితుడితో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దాంతో, పోలీసులు నిందితుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం ఒప్పుకున్న నిందితులు, జామ్ నగర్ - కళావద్ హైవే సమీపంలో నేరం జరిగిన ప్రదేశం వద్దకు పోలీసులను తీసుకువెళ్లారు. అక్కడ సగం కాలిన స్థితిలో ఉన్న ఆ బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈర్ష్యతో..
నిందితుడు, స్థానికంగా 11వ తరగతి చదువుతున్న బాధిత బాలుడు ఒకే ప్రాంతంలో నివసించేవారు. వారి కుటుంబాలు కూడా కొన్ని సంవత్సరాలుగా స్నేహంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య శారీరక సంబంధం (same-sex relationship) ఏర్పడింది. కొన్నాళ్లుగా ఆ బాలుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తుండడంతో పాటు, వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండడం గమనించిన నిందిత యువకుడు ఈర్ష్యతో ఆ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో శుక్రవారం రాత్రి ఆ బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టడానికి వారిరువురూ ప్రయత్నించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.