తెలుగు న్యూస్  /  Entertainment  /  Liger Beats Allu Arjun Pushpa Collections In Bollywood On Day 1

Liger Bollywood Collection: తొలిరోజు హిందీలో పుష్ప‌, సైరా క‌లెక్ష‌న్స్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన లైగ‌ర్‌

HT Telugu Desk HT Telugu

27 August 2022, 20:51 IST

  • Liger Bollywood Collection: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు బాలీవుడ్ లో తొలిరోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే....
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (twitter)

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే

Liger Bollywood Collection: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ సినిమా ఫ్లాప్ టాక్‌తో నిరాశ‌ప‌రిచింది. తొలిరోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 33 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు మాత్రం 15 నుంచి 16 కోట్ల వ‌ర‌కు కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. విజ‌య్ ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నార్త్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే లైగర్ (Liger) సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. యువ‌త‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా బాలీవుడ్‌లో లైగ‌ర్‌పై భారీగానే అంచానాలు ఏర్ప‌డ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

కానీ పూరి స్క్రిప్ట్‌, టేకింగ్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తొలిరోజు హిందీలో లైగర్ 5.75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన సౌత్ హీరోల సినిమాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా లైగర్ నిలిచింది. ఈ జాబితాలో 53 కోట్ల తో కేజీఎఫ్ 2 టాప్ ప్లేస్ లో నిలవగా బాహుబలి 2, సాహో, ఆర్ఆర్ఆర్, రోబో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన చిత్రంగా లైగర్ నిలిచింది.

చిరంజీవి సైరా, అల్లు అర్జున్ పుష్ప, ప్రభాస్ రాధేశ్యామ్, బాహుబలి సినిమాలు లైగర్ తర్వాతే నిలవడం గమనార్హం. హిందీలో ఒకరోజు ఆలస్యంగా ఈ సినిమా రిలీజైంది. గురువారం రోజు పెయిడ్ ప్రీమియర్స్ ను మాత్రమే ప్రదర్శించారు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.