liger trailer telugu: లైగ‌ర్ ట్రైల‌ర్ వచ్చేసింది...విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌-vijay devarakonda liger trailer out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Devarakonda Liger Trailer Out

liger trailer telugu: లైగ‌ర్ ట్రైల‌ర్ వచ్చేసింది...విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 09:34 AM IST

విజ‌య్‌దేవ‌ర‌కొండ (vijay devarakonda) హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం లైగ‌ర్‌ (liger). ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాల‌తో ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగిన ఈ ట్రైల‌ర్ విజ‌య్‌దేవ‌ర‌కొండ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

విజ‌య్‌దేవ‌ర‌కొండ
విజ‌య్‌దేవ‌ర‌కొండ (twitter)

liger telugu trailer: లైగ‌ర్ ట్రైల‌ర్‌తో అభిమానుల‌ను అల‌రించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా లైగర్ రిలీజ్ కానుంది. క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ‌మెహ‌తాల‌తో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ పాన్ ఇండియ‌న్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గురువారం లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక లయన్ కి, టైగర్ పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ ప్రారంభమైంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ పై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ లు డిఫరెంట్ గా హాలీవుడ్ శైలిలో ఉన్నాయి. యాక్షన్ అంశాలతో పాటు విజయ్, అనన్యా పాండే రొమాంటిక్ ట్రాక్ ను స్టైలిష్ గా ట్రైలర్ లో చూపించారు దర్శకుడు. ఇందులో విజయ్ నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా కనిపించారు. ఐయామ్ ఏ ఫైటర్ అంటూ ట్రైలర్ చివరల్లో తడబడుతూ చెప్పే విజయ్ చెప్పే డైలాగ్ ఆసక్తిని పంచుతోంది.

ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిరంజీవి, హిందీ ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తెలుగు ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌ను సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిపారు. ఈ వేడుక‌లో క‌ర‌ణ్‌జోహర్‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మితో పాటు చిత్ర క‌థానాయిక అనాన్య‌పాండే పాల్గొన్న‌ది. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంతో పాటు క‌న్న‌డంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్