Telugu Cinema News Live September 7, 2024: Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా
07 September 2024, 20:27 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Mathu Vadalara 2 Runtime, Trailer release date: మత్తువదలరా 2 చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ మూవీ ట్రైలర్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. దీంతో రన్‍టైమ్ కూడా ఫిక్స్ అయింది.
- Bigg Boss 8 Telugu: బిగ్బాస్ 8వ సీజన్‍లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ నేడు ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. జడ్జిమెంట్ విషషయంలో నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ, సోనియా ఫైట్‍ను హైలైట్ చేశారు.
- 35 Chinna Katha Kadu OTT Platform: ‘35 చిన్న కథ కాదు’ సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌ను తాజాగా ఖరారు చేసుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఆ వివరాలివే..
- OTT Crime Thriller: విస్ఫోట్ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‍ముఖ్, ఫరీద్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..
- Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండోపాట వచ్చేస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు వెల్లడించింది. అయితే, చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తుందని ఆశించిన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
- Devara Trailer Release Date: దేవర సినిమా నుంచి సాలిడ్ అప్‍డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్ అయింది. వినాయక చవితి సందర్భంగా నేడు అప్‍డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.
- OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ముఖ్యంగా ఏడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అందులో మూడు స్ట్రైట్ సినిమాలు కాగా.. మరో నాలుగు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Romantic Comedy OTT: టాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఆయ్ ఓటీటీలోకి వస్తోంది. నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆయ్ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించాడు.
Mr Bachchan OTT: రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఆఫీషియల్‌గా వచ్చేసింది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
Renu Desai on Indian 2: ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ కావడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఇండియన్ 2 డైలాగ్ రైటర్స్‌ను ఇడియట్స్ అంటూ రేణుదేశాయ్ పేర్కొన్నడం రేణుదేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Devara Part 1: తెలుగులోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ సాధించలేకపోయిన జాన్వీ.. టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో రోహిణికి పార్లర్ పెట్టుకోవడానికి ప్రభావతి ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం బాలు సహించలేకపోతాడు. రోహిణికి డబ్బులు ఇచ్చినట్లే...మీనాకు కూడా ఇవ్వాలని పట్టుపడతాడు. మీనా వద్దని అంటుంది.
Bigg Boos 8 Telugu: బిగ్బాస్ లో బెటర్ క్లాన్‌గా యష్మి టీమ్ నిలిచింది. దాంతో ఇంటి పనుల నుంచి యష్మి టీమ్‌కు బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. లగ్జరీ రూమ్‌లోకి తమకు ఎంట్రీ దొరకడంతో యష్మి ఓవరాక్షన్ చేసింది.
Brahmamudi September 7th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో కళ్యాణ్ పుట్టినరోజునాడు గుడిలో అన్నదానం చేస్తుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ అన్నదానానికి వచ్చిన కళ్యాణ్, అప్పులను ధాన్యలక్ష్మి అవమానిస్తుంది.
- Karthika deepam 2 september 7th: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీని పెళ్లి చేసుకోవడానికి తాను ఒప్పుకొనని శ్రీధర్ అంటాడు. కానీ స్వప్న మాత్రం తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొనని తెగేసి చెప్తుంది. తాను చూసిన సంబంధం చేసుకునేలా చేసేందుకు ఎంతకైనా తెగిస్తానని శ్రీధర్ అంటాడు.
Crime Comedy OTT: దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన మలయాళం క్రైమ్ కామెడీ మూవీ నునాక్కుజి థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నునాక్కుజి మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలకాబోతోంది.