Bigg Boos 8 Telugu: యష్మి ఓవ‌రాక్ష‌న్ - పృథ్వీ అన్‌ఫెయిర్‌గేమ్ - అఖండ టీమ్‌కు ల‌గ్జ‌రీ రూమ్‌-bigg boss 8 telugu day 5 highlights yashmi team won dragonfly room entry pass star maa disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boos 8 Telugu: యష్మి ఓవ‌రాక్ష‌న్ - పృథ్వీ అన్‌ఫెయిర్‌గేమ్ - అఖండ టీమ్‌కు ల‌గ్జ‌రీ రూమ్‌

Bigg Boos 8 Telugu: యష్మి ఓవ‌రాక్ష‌న్ - పృథ్వీ అన్‌ఫెయిర్‌గేమ్ - అఖండ టీమ్‌కు ల‌గ్జ‌రీ రూమ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 07, 2024 08:34 AM IST

Bigg Boos 8 Telugu: బిగ్‌బాస్ లో బెట‌ర్ క్లాన్‌గా య‌ష్మి టీమ్ నిలిచింది. దాంతో ఇంటి ప‌నుల నుంచి య‌ష్మి టీమ్‌కు బిగ్‌బాస్ మిన‌హాయింపు ఇచ్చాడు. ల‌గ్జ‌రీ రూమ్‌లోకి త‌మ‌కు ఎంట్రీ దొర‌క‌డంతో య‌ష్మి ఓవ‌రాక్ష‌న్ చేసింది.

బిగ్‌బాస్ 8 తెలుగు
బిగ్‌బాస్ 8 తెలుగు

Bigg Boos 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగు శుక్ర‌వారం ఎపిసోడ్‌లో నైనిక‌, య‌ష్మి టీమ్‌ల‌కు బిగ్‌బాస్ లూప్ ది హోప్స్ పేరుతో కొత్త‌ టాస్క్ ఇస్తాడు. చేతితో ట‌చ్ చేయ‌కుండా బాడీతో రింగ్‌ల‌ను పాస్ చేయాల‌ని రూల్ పెట్టాడు. ఈ టాస్క్ మొత్తం గొడ‌వ‌ల‌తో సాగింది. రూల్స్ విష‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

సంచాల‌క్‌గా ప‌నిచేసిన నిఖిల్ మాట‌ను య‌ష్మి టీమ్ విన‌లేదు. తొండి గేమ్ ఆడి గెలిచారు. నిఖిల్ అభ్యంత‌రం చెప్పినందుకు బుర్రా లేదా అంటూ నిఖిల్‌తో య‌ష్మి వాద‌న‌కు దిగింది. ఈ టాస్క్‌లో నైనిక టీమ్ గెలిచింద‌ని నిఖిల్ ప్ర‌క‌టించాడు. ఈ టాస్క్ విష‌యంలో నిఖిల్‌తో య‌ష్మి ఆర్గ్యూ చేస్తూనే ఉంది.

బిగ్‌బాస్‌లో జోక‌ర్లు...

నేను ఎలిమినేట్ అయితే రిగ్రేట్ అవుతావా అంటూ నిఖిల్‌ను అడిగింది సోనియా. కొంచెం అవుతానంటూ నిఖిల్ స‌మాధాన‌మిచ్చాడు. ఒంట‌రిగా ఉన్న సోనియాను నిఖిల్ ఓదార్చ‌తాడు. ఫ్యామిలీ మిస్స‌వుతున్నాన‌ని సోనియా ఎమోష‌న‌ల్ అయ్యింది. తాను బోరింగ్‌గా ఫీల‌వుతున్నాన‌ని సోనియా అంటుంది. ఆమెను బ‌తిమిలాడి కిచెన్‌లోకి తీసుకెళ్లాడు నిఖిల్‌. బిగ్‌బాస్‌లో చాలా మంది జోక‌ర్లు ఉన్నార‌ని, నీకు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవుతుంద‌ని చెప్పి ఆమెను న‌వ్వించాడు.

త‌మ‌ను టాస్క్‌లో ఓడించిన నైనిక టీమ్ బ్యాండ్‌ల‌ను య‌ష్మి దాచేస్తుంది. గేమ్ విష‌యంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై రివేంజ్‌కు ప్లాన్ చేసింది.

నైనిక‌, య‌ష్మి టీమ్‌ల‌కు బిగ్‌బాస్ ఇచ్చిన రెండు టాస్క్‌ల‌లో చెరోటి గెలుస్తారు. దాంతో విన్న‌ర్స్‌ను నిర్ణ‌యించ‌డానికి మూడో టాస్క్ బ్రిక్ ది బ్యాలెన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ బ్రిక్స్ టాస్క్ మొత్తం ఆన్‌ఫెయిర్ గా సాగింది. నైనిక టీమ్ బాగా ఆడిన‌...పృథ్వీ కావాల‌నే వారు ఓడిపోయేలా చేశాడు. సంచాల‌క్ అయిన నిఖిల్ య‌ష్మి టీమ్ స‌రిగ్గా ఆడ‌టం లేద‌ని ప్ర‌క‌టించాడు. దొంగ‌త‌నంగా య‌ష్ని టీమ్ టాస్క్‌లో గెలుస్తుంది. దాంతో య‌ష్మి క్లాన్ ...బెట‌ర్ క్లాన్ గా నిలిచింద‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు.

య‌ష్మి క్లాన్‌లోకి సోనియా...

టాస్క్‌లో గెలిచిన య‌ష్మి టీమ్‌...నిఖిల్ క్లాన్ నుంచి ఒక‌రిని త‌మ క్లాన్‌లో చేర్చుకోవాల‌ని బిగ్‌బాస్ అన్నాడు. సోనియాను త‌మ క్లాన్‌లో చేర్చుకుంటున్న‌ట్లు య‌ష్మి ప్ర‌క‌టించింది.

య‌ష్మి టీమ్‌కు ల‌గ్జ‌రీస్‌...

టాస్క్‌లో గెలిచిన య‌ష్మి టీమ్‌కు డ్రాగ‌న్ ఫ్లై రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనుమ‌తి ఇచ్చాడు బిగ్‌బాస్‌. త‌మ‌కు ల‌గ్జ‌రీయ‌స్ రూమ్‌లోకి ఎంట్రీ దొర‌క‌డంతో య‌ష్మి టీమ్ సంబ‌రాలు పేరుతో ఓవ‌రాక్ష‌న్ చేసింది. మిగిలిన టీమ్ వాళ్ల‌ను ఏడిపించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ది య‌ష్మి. త‌మ టీమ్‌కు అఖండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారు య‌ష్మి టీమ్‌. అంతులేనివీరులు అంటూ త‌మ టీమ్‌కు పేరు పెట్టిన‌ట్లు నైనిక ప్ర‌క‌టించింది. త‌మ టీమ్‌కు కెర‌టం అనే పేరు పెట్టిన‌ట్లు నిఖిల్, బేబ‌క్క అన్నారు.

య‌ష్మికి బిగ్‌బాస్ ఇంటి ప‌నుల నుంచిమిన‌హాయింపు ఇచ్చారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఇంటి ప‌నులు స‌క్ర‌మంగా చేస్తున్నారా లేదా చూసే బాధ్య‌త‌ను ఆమెకు ఇచ్చాడు. ఎవ‌రెవ‌రూ ఏ ప‌నులు చేయాలో నువ్వే నిర్ణ‌యించాల‌ని య‌ష్మికి సూచించాడు. దాంతో కిచెన్ ప‌నుల‌ను నిఖిల్ టీమ్‌కు అప్ప‌గించింది య‌ష్మి. క్లీనింగ్ డ్యూటీని నైనిక టీమ్‌కు ఇచ్చింది.