OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?-ott telugu movies to release this week satya other two in dubbing jiocinema netflix aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movie This Week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?

OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 02, 2024 04:11 PM IST

OTT Telugu Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం ఎక్కువగా డబ్బింగ్ సినిమాల జోరే కనిపించేలా ఉంది. ఈ వారం తెలుగులో మూడు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ మూడు డబ్బింగ్‍లోనే రానున్నాయి.

OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?
OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?

ఈ సెప్టెంబర్ తొలివారంలో ఓటీటీల్లో తెలుగు సినిమాల సందడి పెద్దగా కనిపంచేలా లేదు. తెలుగులో ఈ వారం మూడు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయ్యాయి. స్ట్రీమింగ్ డేట్స్ ఖరారు చేసుకున్నాయి. అయితే, ఈ మూడు సినిమాలు కూడా డబ్బింగ్‍లోనే రానున్నాయి. అయితే, సడెన్‍గా ఏవైనా తెలుగు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి వస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ వారం ఓటీటీల్లో తెలుగులోకి రానున్న చిత్రాలు ఏవంటే..

ది ఫాల్ గాయ్

జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవల చాలా హాలీవుడ్ సినిమాలను తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం జియో సినిమా ఓటీటీలో ‘ది ఫాల్ గాయ్’ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ ఇంగ్లిష్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి వెర్షన్‍లను కూడా తీసుకురానున్నట్టు జియోసినిమా కన్ఫర్మ్ చేసింది.

ది ఫాల్ గాయ్ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేయగా.. డేవిడ్ లెట్చ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 3న ఇంగ్లిష్‍లో థియేటర్లలో రిలీజై మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ చిత్రాన్ని జియోసినిమా ఓటీటీలో తెలుగులోనూ చేసేయవచ్చు.

సత్య

సత్య సినిమా ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తమిళ మూవీ రంగోలీకి తెలుగు వెర్షన్‍గా ఈ చిత్రం వస్తోంది. తమిళంలో రంగోలి చిత్రం గతేడాది సెప్టెంబర్‌లోనే విడుదలైంది. ఆ రొమాంటిక్ లవ్ మూవీనే తెలుగు డబ్బింగ్‍లో సత్య పేరుతో ఈ ఏడాది థియేటర్లలోనూ రిలీజ్ అయింది.

సత్య చిత్రంలో హమరేశ్, ఆడుకాలం మురుగదాస్, ప్రార్థన సందీప్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చింది. సత్య చిత్రాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో వీక్షించుచొచ్చు.

అడియోస్ అమిగో

మలయాళ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది. మలయాళ కామెడీ డ్రామా సినిమా అడియోస్ అమిగో కూడా థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైనా ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు వస్తుంది.

అడియోస్ అమిగో మూవీలో సూరజ్ వెంజరమూడు, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు చేయగా.. నాహస్ నజర్ దర్శకత్వం వహించారు. జీవితంలో విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల పరిచయం, స్నేహం, సవాళ్ల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘కిల్’ ఈవారం సెప్టెంబర్ 6న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ చిత్రం ప్రస్తుతానికి హిందీలో ఒక్కటే వచ్చే ఛాన్స్ ఉంది.

సడెన్‍గా ఏమైనా వస్తాయా?

ఈ వారం వినాయక చవితి పండుగ ఉండటంతో స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏమైనా ఓటీటీలో సడెన్‍గా వస్తాయా అనేది ఉత్కంఠగా ఉంది. ఆగస్టులో థియేటర్లలో రిలీజైన మిస్టర్ బచ్చన్, కమిటీ కుర్రోళ్ళు తెలుగు చిత్రాలు ఈ సెప్టెంబర్ తొలివారమే వారమే ఓటీటీలోకి వస్తాయా అనే సందేహాలు ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ చేతిలో ఉండగా.. కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో రానుంది. మరి ఈ చిత్రాలు ఈ వారమే ఓటీటీలోకి వస్తాయా.. ఆలస్యమవుతుందా చూడాలి. మరే ఇతర సినిమాలైన సర్‌ప్రైజింగ్‍గా ఈ వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెడతాయా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

Whats_app_banner