Crime Comedy OTT: ఓటీటీలోకి దృశ్యం డైరెక్టర్ మలయాళం క్రైమ్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Crime Comedy OTT: దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన మలయాళం క్రైమ్ కామెడీ మూవీ నునాక్కుజి థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నునాక్కుజి మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలకాబోతోంది.
Crime Comedy OTT: దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ లేటెస్ట్ మలయాళం క్రైమ్ కామెడీ మూవీ నునాక్కుజి థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. నునాక్కుజి మూవీ థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. జీతూ జోసెఫ్ స్టైల్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.
పది కోట్ల బడ్జెట్ - 20 కోట్ల కలెక్షన్స్...
నునాక్కుజి సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి హిట్‌గా నిలిచింది. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 20 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
సెప్టెంబర్ 13 నుంచి...
నునాక్కుజి ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ ఆఫీషియల్‌గా ప్రకటించింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ భాషల్లో నునాక్కుజి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. జీతూ జోసెఫ్ సినిమాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నునాక్కుజి డిజిటల్ రైట్స్‌ను జీ5 ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం.
నాన్ కుజి కథ ఇదే...
ఇబీ జకారియా(బాసిల్ జోసెఫ్) ఓ బిజినెస్‌మెన్. తండ్రి చనిపోవడంతో వారసత్వంగా వ్యాపారబాధ్యతలు అతడి చేతికివస్తాయి. ఓ రోజు అతడి ఇంటిపై ఐటీ అధికారులు దాడిచేస్తారు. బ్లాక్‌మనీతో పాటు ఈబీ పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేస్తారు. ఆ ల్యాప్‌ట్యాప్‌లో భార్య రిమీతో (నిఖిలా విమల్) కలిసి ఈబీ రొమాన్స్ చేసిన వీడియోలు ఉంటాయి.
ఆ వీడియోలు ఎవరి కంట పడకుండా ల్యాప్‌ట్యాప్‌ను ఎలాగైనా ఐటీ అధికారుల నుంచి కొట్టేయాలని ఈబీ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తూ పోతాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఇబీ కథలోకి రష్మిత, రెంజీ ఎలా వచ్చారు అన్నదే నునాక్కుజిమూవీ కథ.
సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లు...
సిట్యూవేషనల్ కామెడీ, సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో జీతూ జోసెఫ్ నునాక్కుజికథను నడిపించిన తీరుకు మంచి పేరొచ్చింది బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ కూడా తమ యాక్టింగ్‌తో మెప్పించారు. కేవలంరెండు గంటల నిడివిలోపే ఈ సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్. క్రైమ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న జీతూ జోసెఫ్ తన పంథాకు భిన్నంగా కామెడీ కథతో నునాక్కుజి సినిమాను తెరకెక్కించారు.
నాలుగు సినిమాలు...
ప్రస్తుతం మలయాళంలో బాసిల్ జోసెఫ్ గుడ్‌టైమ్ నడుస్తోంది. ఈ ఏడాది ఎనిమిది నెలల వ్యవధిలోనే అతడు హీరోగా నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇందులో వర్షన్‌గల్కు శేషం, గురువాయూర్ అంబలనాదాయిల్‌తో పాటు నాన్ కుజి సినిమాలు హిట్టయ్యాయి.
సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న టోవినో థామస్ ఏఆర్ ఎమ్‌లో బాసిల్ జోసెఫ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ యాక్షన్ మూవీతో మరో రెండు మలయాళ సినిమాల్లో బాసిల్ జోసెఫ్ హీరోగా కనిపించబోతున్నాడు.