Nani Movie Budget: దసరాతో హీరో నానికి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ 120 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. గత ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మూవీ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి.
ఈ సారి నాని కోసం హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ కథను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా కథ 1990 టైమ్ పీరియడ్‌లో సాగుతుందని అంటున్నారు. దసరా తరహాలోనే ఇందులో కూడా ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
కాగా ఈ సినిమా బడ్జెట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 120 నుంచి 150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో నాని, శ్రీకాంత ఓదెల మూవీ రూపొందనున్నట్లు సమాచారం. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
నాని, శ్రీకాంత్ ఓదెల మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దసరా సినిమాను ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి.... నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ షూటింగ్‌తో నాని బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్నీ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తోన్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో నాని, ప్రియాంక మోహన్ కలిసి గ్యాంగ్‌లీడర్ మూవీలో జంటగా కనిపించారు.
సరిపోదా శనివారం మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తోన్నాడు. ఆగస్ట్ 29న పాన్ ఇండియన్ లెవెల్‌తో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.సరిపోదా శనివారం తర్వాత నాని హిట్ 3 మూవీ చేయబోతున్నాడు.
గత ఏడాది ఈ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాదు. హీరోగా నటిస్తూనే ఈ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు నాని. హిట్ 3 మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్, హిట్ 2 సినిమాలు కమర్షియల్‌గా సక్సెసులుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు కేవలం ప్రొడ్యూసర్‌గానే వ్యవహరించిన నాని..హిట్ 3లో హీరోగా నటిస్తోన్నాడు.