OTT Crime Thriller: ఓటీటీలోకి వస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT Crime Thriller: పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆపరేషన్ రావణ్ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించాడు. సంకీర్తన విపిన్, రఘు కుంచే, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఆపరేషన్ రావణ్ మూవీతో డైరెక్టర్‌గా వెంకట సత్య టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.
ఈటీవీ విన్ ఓటీటీ...
ఆపరేషన్ రావన్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్‌త్వరలోనే ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు తెలిసింది.
సైకో కిల్లర్ కథ...
అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ సైకో కథతో దర్శకుడు వెంకట సత్య ఆపరేషన్ రావణ్ సినిమాను తెరకెక్కించాడు. ఆమని (సంకీర్తన) ఓ ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్. సిటీలో వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ హత్యలకు పాల్పడుతోన్న ఈ సీరియల్ కిల్లర్ కేసును ఇన్వేస్టిగేషన్ చేస్తుంటుంది. ఈ ఇన్వేస్టిగేషన్‌లో ఆమనికి అసిస్టెంట్‌గా రామ్ (రక్షిత్ అట్లూరి) పనిచేస్తుంటాడు.
ఆమనిని ప్రేమిస్తుంటాడు రామ్. తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేసేలోపు అమనిని కూడా సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. ఆ కిల్లర్‌ను రామ్ ఎలా పట్టుకున్నాడు? సుజాత (రాధికా శరత్‌కుమార్) కూతురి మిస్సింగ్‌కు ఈ సీరియల్ కిల్లర్‌కు ఏమైనా సంబంధం ఉందా? కిల్లర్ గురించి ఆమని, రామ్‌లకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి అన్నదే ఆపరేషన్ రావణ్ మూవీ కథ.
ట్విస్ట్‌లు యావరేజ్..
రెగ్యులర్ సైకో థ్రిల్లర్ ఫార్మెట్‌లోనే ఆపరేషన్ రావణ్ సాగడం, ట్విస్ట్‌లు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రక్షిత్ అట్లూరి నటన బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా దర్శకుడు వెంకట సత్య...రక్షిత్ అట్లూరి తండ్రి కావడం గమనార్హం. ఆపరేషన్ రావణ్ సినిమాకు శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందించాడు.
పలాస 1978తో హిట్...
పలాస 1978 మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రక్షిత్ అట్లూరి. సామాజిక అసమానతలను చర్చిస్తూ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
లండన్ బాబులు, నరకాసురతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. కాన్సెప్ట్‌లు బాగున్నా ఈ సినిమాలు విజయాల్ని మాత్రం అందుకోలేదు. రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తోన్న శశివదనే రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది.
టాపిక్