Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా-prabhas to release mathu vadalara 2 trailer and movie runtime locked censor completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా

Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2024 08:33 PM IST

Mathu Vadalara 2 Runtime, Trailer release date: మత్తువదలరా 2 చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ మూవీ ట్రైలర్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. దీంతో రన్‍‍టైమ్ కూడా ఫిక్స్ అయింది.

Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా
Mathu Vadalara 2 - Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా చేసిన తొలి మూవీ ‘మత్తువదలరా’ మంచి హిట్ అయింది. ఈ చిత్రం నటుడిగా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. యమదొంగ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సింహా.. ఆ తర్వాత మళ్లీ 2019లో మత్తువదలరా మూవీతో తెరపై కనిపించారు. ఆ మూవీ హిట్ అయినా.. ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలతో శ్రీసింహాకు నిరాశ ఎదురైంది. అయితే, సూపర్ హిట్ అయిన మత్తువదలరా చిత్రానికి ఐదేళ్ల తర్వాత సీక్వెల్ వస్తోంది. ‘మత్తువదలరా 2’ చిత్రం సెప్టెంబర్ 13న రానుంది. ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.

మత్తువదలరా 2 సినిమా ట్రైలర్ రిలీజ్‍కు డేట్, టైమ్‍ ఖరారైంది. ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తోంది. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్

మత్తువదలరా 2 సినిమా ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రానుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయనుండటంతో మరింత హైప్ ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఈ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

శ్రీసింహ, సత్యతో కారులో ప్రభాస్ కూర్చున్నట్టు ఫొటోను మత్తువదలరా 2 టీమ్ క్రియేట్ చేసింది. ఈ పోస్టర్‌తో ట్రైలర్ టైమ్‍ను రివీల్ చేసింది. “రెబల్ ఫోర్స్ నుంచి ఈ గ్యాంగ్‍కు పెద్ద సపోర్ట్ దక్కింది. మత్తువదలా 2 ట్రైలర్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు ప్రభాస్ లాంచ్ చేయనున్నారు” అని ఈ మూవీని నిర్మిస్తున్న క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.

తక్కువ రన్‍టైమ్‍తో..

మత్తువదలరా 2 సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింద సెన్సార్ బోర్డు. ఈ మూవీ 2 గంటల 19 నిమిషాల (139 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుందని తెలుస్తోంది. దీంతో కాస్త క్రిస్ప్‌గా తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ మూవీ వస్తోంది. క్రైమ్ కామెడీ చిత్రానికి ఈ రన్‍టైమ్ ప్లస్‍గానే ఉండే అవకాశం ఉంది.

మత్తువదలరా 2 సినిమాలో శ్రీసింహా, సత్య లీడ్ రోల్స్ చేశారు. వెన్నెల కిశోర్, ఫారియా అబ్దుల్, సునీల్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సింహా, సత్య మరోసారి కామెడీతో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లోని మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మత్తువదలరా 2 టీమ్ ప్రమోషన్లను కూడా విభిన్నంగా చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్టులతో వీడియోలు చేస్తోంది. కాగా, ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్‍ను హీరోయిన్ ఫారియా అబ్దుల్లా రచించటంతో పాడారు. ఈ మూవీని డైరెక్టర్ రితేశ్ రానా తెరకెక్కించారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి, పెదమల్లు, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.