Faria Abdullah: సింగర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్‌గా మారిన జాతి రత్నాలు చిట్టి.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా-faria abdullah became singer lyricist choreographer in mathu vadalara 2 faria abdullah comments in teaser launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Faria Abdullah: సింగర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్‌గా మారిన జాతి రత్నాలు చిట్టి.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: సింగర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్‌గా మారిన జాతి రత్నాలు చిట్టి.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా

Sanjiv Kumar HT Telugu
Aug 31, 2024 06:15 AM IST

Faria Abdullah Became Singer Lyricist Choreographer: జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సింగర్‌గా, పాటల రచయితగా, కొరియోగ్రాఫర్‌గా మారి తన అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. మత్తు వదలరా 2 సినిమాతో తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకుంది. ఫరియా అబ్దుల్లా కామెంట్స్‌లోకి వెళితే..

సింగర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్‌గా జాతి రత్నాలు చిట్టి.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా
సింగర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్‌గా జాతి రత్నాలు చిట్టి.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah Comments: బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మత్తు వదలరాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'మత్తువదలారా2'. ఈ మూవీ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా కమెడియన్ సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు మత్తు వదలరా 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్ట్ 30) మత్తు వదలరా 2 టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

కొరియోగ్రాఫీ కూడా

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్, జాతి రత్నాలు ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "అందరం ఒకే ఫేజ్‌లో ఉన్నాం,సేమ్ హ్యుమర్‌తో వస్తున్నాం. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీం ఇది. ఇది చాలా ఫన్ జర్నీ. మూవీ చూసినప్పుడు మీకూ అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఓ పాట రాయడంతో పాటు పాడాను. అలాగే కొరియోగ్రఫీ కూడా చేశాను. త్వరలోనే పాట వస్తుంది. ఆడియన్స్ సినిమాని కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు' అని తెలిపింది.

దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు హీరోయిన్‌గా, జాతి రత్నాలు సినిమాలో తన నటనతో కామెడీ పండించిన ఫరియా తాజాగా తాను పాట పాడానని, అంతేకాకుండా పాట రాసినట్లు, దానికి కొరియోగ్రఫీ కూడా చేసినట్లు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఫరియా అబ్దుల్లా తన కామెంట్స్‌తో అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు అయింది. ఫరియా అబ్దుల్లా మల్టీ టాలెంటెడ్ అని అంతా ప్రశంసిస్తున్నారు.

చెప్పాల్సిన అవసరం లేకుండా

ఇదిలా ఉంటే, ఇదే మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ సింహ కోడూరి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈవాళ చాలా లక్కీగా అనిపిస్తోంది. జనరల్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చేటప్పుడు సినిమా గురించి చాలా చెప్పాల్సివస్తుంది. ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా పార్ట్ 1ని ఆడియన్స్ పెద్ద హిట్ చేశారు" అని అన్నాడు.

"ఫస్ట్ పార్ట్ థియేటర్స్‌లో చాలా మిస్ అయ్యామని, థియేటర్స్‌లో చూసుంటే ఎక్స్‌పీరియన్స్ ఇంకా అదిరిపోయేదని కొంతమంది మెసేజులు చేశారు. వారందరి కోసం డబుల్ ది ఫన్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఉండేలా సెకండ్ పార్ట్ చేశాం. 13న థియేటర్స్‌లోకి వస్తుంది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి" అని హీరో శ్రీ సింహా తెలిపాడు.

ఫస్ట్ పార్ట్‌లోనే

"అందరికీ నమస్కారం. మత్తువదలరా ఫస్ట్ పార్ట్‌లోనే ఒక ఐడియాని ప్లాంట్ చేసి దాని నుంచి డైరెక్ట్ సీక్వెల్‌గా పార్ట్ 2 చేశాం. అందరూ మత్తువదలరా మరోసారి చూసొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 13న థియేటర్స్‌లోకి వస్తుంది. అందరం చాలా ఇష్టంతో చేశాం. మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని మత్తు వదలరా 2 డైరెక్టర్ రితేష్ రానా పేర్కొన్నారు.