OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్-ott crime thriller visfot stream on jio cinema ott platform also releases in telugu version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2024 05:06 PM IST

OTT Crime Thriller: విస్ఫోట్ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‍ముఖ్, ఫరీద్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..

OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Crime Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

రెండేళ్ల నిరీక్షణ తర్వాత విస్ఫోట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో రితేశ్ దేశ్‍ముఖ్, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెండు కథలతో ఈ చిత్రాన్ని దర్శకుడు కూకీ గులాటీ తెరకెక్కించారు. విస్ఫోట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

విస్ఫోట్ సినిమా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

ఆలస్యాల తర్వాత..

విస్ఫోట్ సినిమా షూటింగ్ 2022లోని ఫినిష్ అయింది. ఈ మూవీని ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే, వివిధ కారణాలతో చాలాసార్లు ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలో నేరుగా ఓటీటీలోకే తీసుకొచ్చేందుకు టీమ్ భావించింది. దీంతో జియో సినిమా ఓటీటీతో డీల్ చేసుకుంది. ఆ ఓటీటీలో విస్ఫోట్ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చింది.

విస్ఫోట్ చిత్రంలో రితేశ్, ఫర్దీన్‍తో పాటు ప్రియా బాపట్, క్రిస్ట్లే డిసౌజా, షీబా చద్దా, సీమా బిస్వాస్, అయాజ్ ఖాన్, పృథ్విరాజ్ సర్నైక్ కీలకపాత్రలు పోషించారు. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ కూకీ గులాటీ. వెనుజువెలా మూవీ ‘రాక్, పేపర్, సిజర్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

విస్ఫోట్ మూవీకి అమ్‍జాన్ నదీమ్ ఆమిర్ మ్యూజిక్ ఇవ్వగా.. శిఖర్ భట్నాగర్ సినిమాటోగ్రఫీ చేశారు. వైట్ ఫెదర్ ఫిల్మ్స్ పతాకంపై సంజయ్ గుప్తా, అనురాధా గుప్తా మూవీని ప్రొడ్యూజ్ చేశారు.

విస్ఫోట్ స్టోరీలైన్

విస్ఫోట్ మూవీలో ఏకకాలంలో రెండు కథలను చూపించారు దర్శకుడు గులాటీ. షోయబ్ ఖాన్ (ఫర్దీన్ ఖాన్) డోంగ్రీలో జీవనం సాగిస్తుంటాడు. ఓ రోజు అతడి స్నేహితుడు మాన్య (నచికేత్ పూర్ణపత్రే) ఓ జాకెట్‍ను షోయబ్ కారులో వదిలివెళతాడు. అందులో డ్రగ్స్ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకునేందుకు మాన్య ప్రయత్నిస్తాడు. అయితే, షోయబ్ ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ జాకెట్‍ను అతడి తల్లి ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటారు. ఈ ఘటనతో షోయబ్‍కు చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీలో చూడాలి.

మరో కథలో.. తన భార్య తారా (ప్రియా బాపట్) తనను మోసం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకుంటాడు ఆకాశ్ షెలార్ (రితేశ్ దేశ్‍ముఖ్). అతడి కుమారుడు కూడా తప్పిపోతాడు. మరోవైపు భార్య తారను ఆకాశ్ వెతికేపనిలో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. తారా చేసిన మోసం ఏంటి? అనేది ఈ కథలో ఉంటుంది. ఈ చిత్రంలో ఈ రెండు కథలు ఏకకాలంలో సాగుతుంటాయి. వీరి కథలు ఏ చోట కలుస్తాయి.

జియోసినిమా ఓటీటీలో ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ ‘ది ఫాల్ గాయ్’ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ బాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ ప్రధాన పాత్రలు చేశారు.