OTT Hollywood Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్-action comedy movie the fall guy streaming now on jiocinema ott platform in english telugu and other five languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Hollywood Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్

OTT Hollywood Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 03, 2024 02:20 PM IST

The Fall Guy OTT Streaming: ది ఫాల్ గాయ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మంచి క్రేజ్ ఉన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మొత్తంగా ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ కామెడీ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

OTT Hollywood Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్
OTT Hollywood Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్

పాపులర్ హాలీవుడ్ సినిమాnను జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వరుసగా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేస్తోంది. ఇంగ్లిష్‍తో పాటు భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెస్తోంది. గత నెల డ్యూన్ పార్ట్ 2తో పాటు ఇంకో హాలీవుడ్ చిత్రాన్ని కూడా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. ఇప్పుడు జియోసినిమా ఓటీటీలో మరో హాలీవుడ్ చిత్రం అడుగుపెట్టింది. ‘ది ఫాల్ గాయ్’ చిత్రం నేడు (సెప్టెంబర్ 3) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ యాక్షన్ కామెడీ సినిమా వివరాలివే..

ఏడు భాషల్లో స్ట్రీమింగ్

‘ది ఫాల్ గాయ్’ సినిమా నేడే జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా ఏడు భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఒరిజినల్ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఈ మూవీ ఇప్పటికే ప్రైమ్ వీడియో, జీ5లో రెంట్‍కు అందుబాటులో ఉంది. అయితే, జియోసినిమా ఓటీటీలో రెంట్ లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రైప్షన్ ఉంటే ఈ ది ఫాల్ గాయ్ మూవీని చూసేయవచ్చు.

ది ఫాల్ గాయ్ మూవీలో ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేశారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి డేవిడ్ లెట్చ్ దర్శకత్వం వహించారు. యాక్షన్ స్టంట్‍లతో పాటు కామెడీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది మే 3వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. 1980ల్లో వచ్చిన ‘ది ఫాల్ గాయ్’ అనే టీవీ సిరీస్ ఆధారంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో డేవిడ్ తీసుకొచ్చారు. భారీ ప్రమాదం నుంచి కోలుకున్న ఓ స్టంట్‍మ్యాన్.. కనిపించుండా పోయిన ఓ సినిమా హీరోను కనుగొనడం, కుట్రలను ఛేదించడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.

ది ఫాల్ గాయ్ మూవీకి డొమినిక్ లూయిస్ సంగీతం అందించారు. జొనాథన్ సేలా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించగా.. ఎలిసబెత్ రొనాల్డ్స్ డోటిర్ ఎడిటింగ్ చేశారు. ది ఫాల్ గాయ్ చిత్రంలో ర్యాన్, ఇమిలీ సహా థెరెసా పాల్మర్, స్టెఫానీ, ఆరోన్ టేలర్ - జాన్సన్, వడ్డింగ్‍హామ్, విన్‍స్టన్ డ్యూక్, థెరీసా పాల్మర్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఇక జియోసినిమా ఓటీటీలో చూసేయవచ్చు.

గత వారమే ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’

జియో సినిమా ఓటీటీలో హాలీవుడ్ హిట్ మూవీ గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆగస్టు 29న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం కూడా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రెబకా హాల్, బ్రియన్ టైర్ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కేల్ హట్లీ, అలెక్స్ ఫెర్న్స్ కీలకపాత్రలు పోషించారు. దర్శకుడు ఆజమ్ విన్‍గార్డ్ తెరకెక్కించారు. లెజెండరీ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయిన గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయి భారీ కలెక్షన్లు దక్కించుకుంది.