OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో నాలుగు-ott telugu movies releases this week double ismart simbaa to the fall guy amazon prime video aha jiocinema netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో నాలుగు

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో నాలుగు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2024 02:35 PM IST

OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ముఖ్యంగా ఏడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అందులో మూడు స్ట్రైట్ సినిమాలు కాగా.. మరో నాలుగు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో నాలుగు
OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో నాలుగు

ఓటీటీల్లో ఈ వారం తెలుగు సినిమాలు బాగానే వచ్చాయి. ఓటీటీల్లో నయా తెలుగు చిత్రాలు చూడాలని ప్లాన్ చేసుకున్న వారికి ఎక్కువ ఆప్షన్లు ఈ వారం (సెప్టెంబర్ తొలి వారం) అందుబాటులోకి వచ్చాయి. డబుల్ ఇస్మార్ట్ చిత్రం సడెన్‍గా ఓటీటీలోకి అడుగుపెట్టేసింది. మరో రెండు చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు వచ్చాయి. మరో నాలుగు సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. ఈ వారం తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

డబుల్ ఇస్మార్ట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఈ వారమే సెప్టెంబర్ సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఒరిజినల్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‍లలో ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన డిజాస్టర్ అయిన ఈ యాక్షన్ డ్రామా డబుల్ ఇస్మార్ట్ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నింద

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద చిత్రం ఈ శుక్రవారం (సెప్టెంబర్ 6) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రాజేశ్ జగన్నాథన్ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జూన్ 21న థియేటరల్లో విడుదలైంది. నింద చిత్రాన్ని ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.

సింబా

క్రైమ్ థ్రిల్లర్ ‘సింబా’ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివీ శ్రీనాథ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. నెలలోపే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

డబ్బింగ్‍లో నాలుగు

అడియోస్ అమిగో: మలయాళ సినిమా అడియోస్ అమిగో చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగునూ అందుబాటులోకి వచ్చింది. సూరజ్ వెంజరమూడు, ఆసిఫ్ అలీ ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు.

భార్గవి నిలయం: భార్గవి నిలయం సినిమా సెప్టెంబర్ 5న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంలో గతేడాది గతేడాది ఏప్రిల్‍లో రిలీజైన నీలవెలిచం మూవీ తెలుగు డబ్బింగ్‍లో భార్గవి నిలయం పేరుతో ఆహాలో అడుగుపెట్టింది. భార్గవి నిలయం మూవీలో టొవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ లీడ్ రోల్స్ చేసింది.

ది ఫాల్ గాయ్: హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా ‘ది ఫాల్ గాయ్’ సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది మేలో థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సత్య: లవ్ ఫ్యామిలీ డ్రామా మూవీ సత్య నేడే (సెప్టెంబర్ 7) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన తమిళ మూవీ రంగోలికి తెలుగు వెర్షన్‍గా సత్య పేరుతో వచ్చింది. ఈ మూవీలో హమరేశ్, ఆడుకాలం మురుగదాస్, ప్రార్థన సందీప్ ప్రధాన పాత్రలు పోషించారు.