OTT Crime Thriller: ఓటీటీలోకి వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Nindha OTT Release Date: నింద సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. రెండున్నర నెలల తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్ర పోషించిన నింద చిత్రం ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తో క్యూరియాసిటీ పెంచినా.. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. మిక్స్డ్ టాక్ రావటంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. ఇప్పుడు ఈ నింద సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
నింద సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 6వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు (సెప్టెంబర్ 4) వెల్లడించింది. “మంచోడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టే.. సెప్టెంబర్ 6న ఈటీవీ విన్‍లో నింద ప్రీమియర్” అని సోషల్ మీడియాలో ఈటీవీ విన్ పోస్ట్ చేసింది.
థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలోకి నింద మూవీ వస్తోంది. ముందుగా ఈ మూవీ ఓటీటీ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకోలేదు. ఇటీవలే ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 6న స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది.
నింద సినిమాలో వరుణ్ సందేశ్‍తో పాటు యానీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై కీలకపాత్రలు పోషించారు. ఓ హత్య కేసులో విచారణ విషయంలో పోలీస్ ఆఫీసర్లను, డాక్టర్‌ను హీరో కిడ్నాప్ చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజేశ్ తెరకెక్కించారు.
నింద చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందించగా.. రమీజ్ నవ్‍వీత్ సినిమాటోగ్రఫీ చేశారు. దర్శకుడు రాజేఖ్ జన్నాథం ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించారు.
నింద స్టోరీలైన్
కండ్రకోట అనే గ్రామంలో ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. బాలరాజు (ఛత్రపతి శేఖర్) ఆమెను అత్యాచారం చేసి చంపేశాడనే అభియోగాలు నమోదవుతాయి. విచారణ తర్వాత అతడికి ఉరిశిక్ష విధిస్తుంది న్యాయస్థానం. అయితే, ఆధారాలను చూసి ఈ కేసులో తప్పుడు తీర్పు ఇచ్చానని జడ్జి (తనికెళ్ల భరణి) బాధపడతారు. ఆ వేదనతోనే చనిపోతారు. ఈ కేసులో నిజానిజాలు తేల్చాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని జడ్జి కుమారుడు వివేక్ (వరుణ్ సందేశ్) నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగా ఎస్‍ఐ, కానిస్టేబుల్, ఇద్దరు కమిషనర్లు, ఓ డాక్టర్, ఓ లాయర్‌ను కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ అమ్మాయిని చంపిందెవరు? వారిని వివేక్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? నిజాలను నిరూపించి అసలు నిందితుడిని పట్టించాడా? అనే విషయాలు నింద సినిమాలో ప్రధానంగా ఉంటాయి.
కాగా, వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరాజి’ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం నెల ముగియకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 22న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. విరాజి మూవీలో డిఫరెంట్ లుక్‍లో వరుణ్ కనిపించారు.