OTT Horror Thriller: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Horror Thriller: భార్గవి నిలయం సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రానికి తెలుగు వెర్షన్‍గా ఈ మూవీ వస్తోంది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకే వస్తోంది. భార్గవి నిలయం ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
ఇటీవల కొన్ని మలయాళం చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయి నేరుగా ఓటీటీల్లోకి వస్తున్నాయి. గతంలో హిట్ అయిన, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కొన్ని సినిమాలను డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు. ముఖ్యంగా ఆహా ఓటీటీ ఇటీవల వరుసగా డబ్బింగ్ చిత్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో మరో మలయాళ మూవీని కూడా తెలుగులో స్ట్రీమింగ్‍కు తెస్తోంది. మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ ‘నీలవెలిచం’ తెలుగు వెర్షన్‍లో భార్గవి నిలయం పేరుతో రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ ప్రకటించింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
భార్గవి నిలయం సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ఆహా ఓటీటీ ప్లట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ చిత్రం వచ్చేస్తోంది. “భార్గవి నిలయంతో ఎంటర్‌టైన్ చేసేందుకు మన టొవినో థామస్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా ఓటీటీ నేడు (సెప్టెంబర్ 3) ట్వీట్ చేసింది.
నీలవెలిచం చిత్రం మలయాళంలో గతేడాది ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో టొవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. రాజేశ్ మాధవన్, చెంబన్ వినోద్ జోస్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్ వెలియనాడ్ కీరోల్స్‌లో కనిపించారు. అయితే, కన్నడ మూవీ ‘భార్గవి నిలయం’కు రీమేక్‍గా మలయాళంలో నీలవెలిచం రూపొందింది. ఈ మలయాళ చిత్రం తెలుగులో భార్గవి నిలయం పేరుతోనే ఆహాలోకి వస్తోంది.
ఈ మూవీకి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఓ పాడుపడిన భవనంలో ఆత్మ తిరగడం, ఆ ఫ్లాష్‍బ్యాక్, లవ్ స్టోరీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హారర్ ఎలిమెంట్లు ఈ మూవీలో ఆకట్టుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీలవెలిచం మూవీకి బిజిబాల్, రెక్స్ విజయన్, ఎంఎస్ బాబు రాజ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఓపీఎం సినిమాస్ పతాకంపై ఆషికీ అబు, రీమా కలింగల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్టోరీలైన్
ఆత్మహత్య చేసుకొని ఓ అమ్మాయి.. భార్గవి నిలయంలో ఆత్మ తిరుగుతున్నారని జనాలు చెప్పుకుంటుండటంతో ఈ విషయంపై నవల రాయాలని ది రైటర్ (టొవినో థామస్) నిర్ణయించుకుంటాడు. భార్గవి నిలయాన్నే అద్దెకు తీసుకుంటాడు. భార్గవి (రిమా కల్లింగల్), శశికుమార్ (రోషన్ మాథ్యూస్) మరణాలు, వారు ఎలా ఆత్మలుగా మారారన్న అంశాలను రాయాలని భావిస్తాడు.
అక్కడి స్థానికుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాడు. ఈ రచయిత కూడా తన జీవితంలో ఒంటరితనంతో పోరాడుతుంటాడు. భార్గవి, శశికుమార్‌ల స్టోరీ ఏంటి? వారిది నిజంగానే ఆత్మహత్యేనా? భార్గవి ఎందుకు ఆత్మలా మారింది? వీరి కథతో నవలను రచయిత పూర్తి చేశాడా? అనేది ఈ భార్గవి నిలయం చిత్రంలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. కన్నడలో 1960ల్లో వచ్చిన చిత్రాన్ని మలయాళంలో నీలవెలిచంగా 2023లో తెరకెక్కించారు దర్శకుడు ఆషిక్. కథను ఏ మాత్రం పక్కదోవపట్టించకుండా ఈ మూవీని రూపొందించారనే ప్రశంసలు వచ్చాయి.