2018 Streaming in OTT: సర్‌ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన 2018-2018 streaming in ott as the movie streaming a day earlier than expected ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  2018 Streaming In Ott: సర్‌ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన 2018

2018 Streaming in OTT: సర్‌ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన 2018

Hari Prasad S HT Telugu

2018 Streaming in OTT: సర్‌ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది 2018 మూవీ. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ బుధవారం (జూన్ 7) నుంచి సోనీలివ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉండగా.. మంగళవారమే (జూన్ 6) రావడం విశేషం.

ఓటీటీలోకి వచ్చేసిన 2018 మూవీ

2018 Streaming in OTT: మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 2018 ఊహించిన దాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా బుధవారం (జూన్ 7) నుంచి సోనీలివ్ (sonyliv) ఓటీటీలోకి వస్తుందని అనౌన్స్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా మంగళవారం (జూన్ 6) సాయంత్రం నుంచే ఈ సినిమా స్ట్రీమ్ అవుతుండటం విశేషం.

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వెర్షన్లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓవైపు ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడంపై కేరళలోని థియేటర్ల ఓనర్లు గుర్రుగా ఉన్నారు. రెండు రోజుల పాటు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విక్రయించిన టికెట్లకు సంబంధించి డబ్బు తిరిగి ఇచ్చేయాలనీ నిర్ణయించారు.

మరోవైపు ఈ సోనీలివ్ ఓటీటీ మాత్రం ఒక రోజు ముందే అన్ని భాషల్లోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2018 నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. అయినా మేకర్స్ మాత్రం ఓటీటీలో రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో తమ ఒప్పందాన్ని మేకర్స్ ఉల్లంఘించారంటూ థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018 మూవీ ఆ ఏడాది కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో కేరళతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే సుమారు రూ.200 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం.

సంబంధిత కథనం