Telugu Cinema News Live October 6, 2024: Bigg Boss 8 Wild Cards:నైనిక ఎలిమినేట్.. మణి సేఫ్.. హౌస్‍లో కత్తి ఎవరో చెప్పిన 'వైల్డ్ కార్డ్' హరితేజ.. కూతురితో ఎమోషనల్
06 October 2024, 20:38 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Bigg Boss 8 Telugu: బిగ్బాస్ హౌస్ నుంచి నైనిక అధికారికంగా ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం హౌస్ నుంచి బయటికి వెళ్లారు. వైల్డ్ కార్డ్‌తో కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. హరితేజ ముందుగా వచ్చారు.
- OTT Horror Movie: స్త్రీ 2 చిత్రం ఇటీవల బాక్సాఫీస్‍ను షేక్ చేసే కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘స్త్రీ’ ఇప్పుడు రెండో ఓటీటీలో అడుగుపెట్టింది. స్త్రీ 2 రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు సిద్ధమవుతున్న తరుణంలో మొదటి భాగం మరో ఓటీటీలోకి వచ్చింది. ఆ వివరాలివే..
- Aata Sandeep on Jani Master: జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేయడంపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ స్పందించారు. ఇది తనను బాధించిందని అన్నారు. జానీకి అవార్డు దక్కాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని విషయాలు చెప్పారు.
- 35 Chinna Katha Kaadu OTT: అంచనాలకు తగ్గట్టే ఓటీటీలో 35 చిన్నకథ కాదు చిత్రం అదరగొడుతోంది. అప్పుడు ఓటీటీలో ఓ మైల్‍స్టోన్ క్రాస్ చేసింది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది. వ్యూస్‍లో దూసుకెళుతోంది.
- Bigg Boss Aditya Om: బిగ్బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఐదో వారం మిడ్‍వీక్‍లోనే ఎలిమినేట్ అయ్యారు. షాకింగ్‍గా బయటికి వచ్చేశారు. ఆదిత్యతో బిగ్‍బాస్ ఇంటర్వ్యూ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. మణికంఠపై ఓ రేంజ్‍లో ఆదిత్య ఫైర్ అయ్యారు.
- OTT Telugu Crime Thriller: తత్వ చిత్రం నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే రివీల్ అయింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గానే సాగింది.
Rewind Release Date: అక్టోబర్ నెలలో వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయిరోనక్. అతడు హీరోగా నటించిన రివైండ్ మూవీ అక్టోబర్ 18న రిలీజ్ కాబోతుండగా లగ్గం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
OTT Thriller: అమలాపాల్ లెవెల్ క్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఆహా ఓటీటీలో ఈ వారమే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. ఈ సినిమాకు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
Hero Nikhil: స్వామిరారా, కేశవ తర్వాత హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబోలో దాదాపు ఏడేళ్ల తర్వాత మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాకు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనేటైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌషిక్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
Bigg Boss Wild Card Entry: బిగ్బాస్ 8 తెలుగు లో వైల్డ్ కార్డ్ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరన్నది నేటి సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేయబోతున్నాడు. సండే ఎపిసోడ్ తాలూకు కొత్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dubbing Movies: డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టడం మానేశారని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి అన్నాడు. తెలుగు ప్రేక్షకులను తేలిగ్గా తీసుకుంటూ వారిని అగౌరవపరుస్తున్నారని అబ్బూరి రవి ట్వీట్ చేశాడు. వేట్టయన్ రిలీజ్ నేపథ్యంలో అబ్బూరి రవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Brahmamudi Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో రాజ్, కావ్యలను ఎలాగైనా ఒక్కటి చేయాలని అపర్ణ అనుకుంటుంది. కావ్య తిరిగి దుగ్గిరాల ఇంటికి వస్తేనే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయని భావిస్తుంది. ఇంటికొచ్చి రాజ్‌తో బుద్దిగా కాపురం చేసుకోమని కావ్యకు సలహా ఇస్తుంది.
Malayalam OTT: ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్‌తో రూపొందిన మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ ఫుటేజ్ ఓటీటీలోకి వస్తోంది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫుటేజ్ మూవీలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మలయాళం మూవీకి అనురాగ్ కశ్యప్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
Shraddha Das: టాలీవుడ్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన శ్రద్ధాదాస్ ఫస్ట్ టైమ్ ఓ హారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్రికాల పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను దిల్‌రాజు రిలీజ్ చేశాడు. ఈ మూవీలో మాస్టర్ మహేంద్రన్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Bigg Boss Telugu 8 Nainika Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నైనిక అనసురు ఎలిమినేట్ అయింది. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఢీ షో డ్యాన్సర్ నైనిక ఐదు వారాల వరకు (సుమారుగా 36 రోజులు) ఉంది. కాబట్టి, ఈ ఐదు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా నైనిక ఎంత సంపాదించిందంటే..?