బాలీవుడ్ స్టార్లు శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించిన స్త్రీ చిత్రం 2018లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ హారర్ కామెడీ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదలైన ‘స్త్రీ 2’ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.850కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. స్త్రీ 2 ఇటీవలే రెంటల్ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. ఈ తరుణంలో ఫస్ట్ పార్ట్ ‘స్త్రీ’ సడెన్‍గా ఇప్పుడు మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.
‘స్త్రీ’ చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో చాలా కాలంగా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇటీవలే స్త్రీ 2 రిలీజైన సమయంలో ఈ చిత్రం ఏకంగా హాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍కు వచ్చింది. కాగా, స్త్రీ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హాట్‍స్టార్‌లో ఇప్పటికే ఉండగా.. ప్రైమ్ వీడియోలోనూ నేడు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
‘స్త్రీ 2’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఆ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు కూడా వచ్చింది. అక్టోబర్ రెండో వారంలో ఈ చిత్రానికి రెంట్ తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రైమ్ సబ్‍స్క్రైబర్లందరూ అద్దె లేకుండా స్త్రీ 2 చూసే ఛాన్స్ రానుంది. ఈ తరుణంలోనే తొలి భాగం ‘స్త్రీ’ మూవీని ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చేసింది. హాట్‍స్టార్‌తో పాటు ప్రైమ్ వీడియోలోనూ ఈ సూపర్ హిట్ ఫస్ట్ పార్ట్ చూసేయవచ్చు.
స్త్రీ 2 చిత్రం రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అక్టోబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రెంట్ ఎప్పుడు తొలగిపోతుందా అని చాలా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆలోగానే తొలి భాగం కూడా తమ ప్లాట్‍ఫామ్‍లోనే చూసే విధంగా ‘స్త్రీ’ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రైమ్ వీడియో.
స్త్రీ చిత్రం 2018 ఆగస్టులో రిలీజై మంచి హిట్ సాధించింది. హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు డైరెక్టర్ అమర్ కౌశిక్. శ్రద్ధ, రాజ్‍కుమార్ రావ్ యాక్టింగ్‍తో అదరగొట్టారు. సుమారు రూ.25కోట్లతో రూపొందిన ఆ మూవీ రూ.180కోట్లతో బ్లాక్‍బస్టర్ అయింది. అయితే, దానికి సీక్వెల్‍గా ఈ ఏడాది వచ్చిన ‘స్త్రీ 2’ అంచనాలను మించి రికార్డులను బద్దలుకొట్టి బంపర్ హిట్ కొట్టింది.
స్త్రీ 2 చిత్రం సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజై పాజిటివ్ టాక్‍తో ఆరంభం నుంచి భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు దాదాపు రూ.860కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది. బాలీవుడ్‍లో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ అయింది. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ ఈ మూవీని నిర్మించాయి.