Rewind Release Date: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రివైండ్ - వారం గ్యాప్‌లో టాలీవుడ్ యంగ్ హీరో రెండు సినిమాలు రిలీజ్
Rewind Release Date: అక్టోబర్ నెలలో వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయిరోనక్. అతడు హీరోగా నటించిన రివైండ్ మూవీ అక్టోబర్ 18న రిలీజ్ కాబోతుండగా లగ్గం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Rewind Release Date: వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు యంగ్ హీరో సాయిరోనక్. అతడు హీరోగా నటిస్తోన్న రివైండ్, లగ్గం సినిమాలు అక్టోబర్‌లోరిలీజ్ కానున్నాయి. రివైండ్ మూవీ అక్టోబర్ 18న విడుదలకానుండగా...లగ్గం మూవీ అక్టోబర్ 25న ప్రేక్షకలు ముందుకు వస్తోంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్...
రివైండ్ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. శుక్రవారం రివైండ్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
కార్తిక్ కథ...
కార్తిక్ అనే సాప్ట్‌వేర్ ఇంజినీర్ తొలిచూపులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి మరొకరితో లవ్‌లో ఉంటుంది. టేప్ రికార్డ్‌ను పోలీ ఉన్న టైమ్ మిషన్ కార్తిక్‌కు దొరుకుతుంది. ఆ టైమ్ మిషన్ కారణంగా తన లవ్‌ను సక్సెస్ చేసుకోవడానికి కార్తిక్ ఏం చేశాడు? టైమ్ మిషన్ కారణంగా కొందరు శత్రువులు అతడికి ఎలా ఏర్పడ్డారు అనే అంశాలతో ట్రైలర్‌లో చూపించారు.
రివైండ్ మూవీతో హీరోయిన్ అమృత చౌదరి, డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
లిమిటెడ్ బడ్జెట్‌తో...
రివైండ్ గురించి హీరో సాయి రోనక్ మాట్లాడుతూ చిన్న టీమ్‌తో లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. డైరెక్టర్ కళ్యాణ్ ఎన్.ఆర్.ఐ అయ్యుండి ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మంచి కథతో సినిమాను తీశాడు. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూఆదరిస్తారని ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది అని అన్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన సెంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఇది. అంతర్లీనంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుందిఅని దర్శకుడు అన్నాడు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో
సాయిరోనక్ హీరోగా నటిస్తోన్న లగ్గం మూవీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో దర్శకుడు రమేష్ చెప్పాలా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. లగ్గం మూవీలో రాజేంద్రప్రసాద్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. లగ్గం సినిమాకు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
పాఠశాల మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిరోనక్. కాదలి, లంక, ప్రెషర్ కుక్కర్, పాప్ కార్న్, ఓదెల రైల్వేస్టేషన్ సినిమాల్లో హీరోగా కనిపించాడు. హీరోగా మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.