Hero Mavrick 440 Thunderwheels : స్టైలిష్ హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్..
Hero Mavrick 440 Thunderwheels : హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయ్యింది. థమ్స్ అప్ ప్యాక్‌లను కొనుగోలు చేసి స్కాన్ చేసే వినియోగదారులకు నవంబర్ 15, 2024 వరకు ఈ బైక్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు..
హీరో మోటోకార్ప్ కొత్త మావ్రిక్ 440 థండర్‌వీల్స్ ఎడిషన్‌ని ఆవిష్కరించింది. ఇది తన ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్‌కు మరింత ఆకర్షణను తీసుకొస్తుంది. కొత్త హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ లిమిటెడ్ ఎడిషన్‌ని కోకాకోలా కంపెనీ సహకారంతో నిర్మించారు. భారతీయ ఏరేటెడ్ శీతల పానీయం 'థమ్స్ అప్' నుంచి ప్రేరణ పొంది ప్రత్యేక లివరీని పొందింది. థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ ప్యాక్‌ని కొనుగోలు చేసి, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే వినియోగదారులకు నవంబర్ 15, 2024 వరకు ఈ హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ ఎడిషన్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ విశేషాలు..
లిమిటెడ్ ఎడిషన్ హీరో మావ్రిక్ 440 థండర్‌వీల్స్ థమ్స్ అప్ రంగుల నుంచి ప్రేరణ పొందింది. ఇందులో నీలం, ఎరుపు లివరీ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కవర్లకి ఎరుపు రంగు ఫినిషింగ్ దక్కింది. రెండు వైపులా థండర్‌వీల్స్ స్టిక్కర్‌ను కలిగి ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్, టెయిల్ సెక్షన్ నీలం రంగులో పూర్తి చేశారు. ఇది మంచి కాంట్రాస్ట్‌ను తెస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నమైన లుక్‌ను ఇచ్చే బార్ ఎండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి.
ఈ భాగస్వామ్యం గురించి హీరో మోటోకార్ప్ ఇండియా బీయూ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్ జిత్ సింగ్ మాట్లాడుతూ.. “ఇది ఈ విభాగంలో గేమ్ ఛేంజర్ కానుంది. రెండు ఐకానిక్ బ్రాండ్ల భాగస్వామ్యంతో వినియోగదారులకు సాటిలేని ఉత్పత్తి లభించింది. మా ఫ్లాగ్షిప్ మావ్రిక్ 440 బైక్ మిడ్-వేరియంట్ ఆధారంగా మావ్రిక్ 440 థండర్‌వీల్స్, ప్రామాణికత, స్వతంత్రత, ధైర్యం, విలువలతో రూపొందించడం జరిగింది. ఇవి థమ్స్ అప్‌తో పూర్తిగా సరిపోతాయి. థమ్స్ అప్ స్ఫూర్తితో రూపొందించిన కొత్త కలర్, గ్రాఫిక్స్ ఈ మోటార్ సైకిల్‌ను ప్రత్యేకంగా నిలుపడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఆకట్టుకుంటుంది,” అని అన్నారు.
మావ్రిక్ 440 థండర్వీల్స్ని విడుదల చేయడానికి హీరో మోటోకార్ప్‌తో జతకట్టడం సంతోషంగా ఉందని కోకాకోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్ తెలిపారు. “సృజనాత్మకత, థమ్స్ అప్ బోల్డ్ స్పిరిట్‌తో నిండిన ఈ బైక్, థ్రిల్లింగ్ అనుభవాలను జీవితానికి అందించడానికి మా భాగస్వామ్య అభిరుచిని తెస్తుంది. మేము కలిసి, మా కస్టమర్లకు నిజంగా ప్రత్యేకమైన వాటిలో భాగం కావడానికి అవకాశం ఇస్తున్నాము,” అని అన్నారు.
హీరో మావ్రిక్ 440 స్పెసిఫికేషన్లు..
మావ్రిక్ 440 మెకానికల్స్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇది హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 ఆధారంగా తయారైంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసిన 440 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ని 27 బిహెచ్పీ, 36 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ కోసం ఉపయోగిస్తుంది.
ఆల్-ఎల్ఈడీ లైటింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్‌తో ఇరువైపులా డిస్క్‌ల నుంచి బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది.
సంబంధిత కథనం