Tata Nexon CNG : ​టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో తొలి సీఎన్​జీ కారు ఇదే- లాంచ్​ ఎప్పుడంటే..!-tata nexon icng expected to launch soon check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Cng : ​టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో తొలి సీఎన్​జీ కారు ఇదే- లాంచ్​ ఎప్పుడంటే..!

Tata Nexon CNG : ​టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో తొలి సీఎన్​జీ కారు ఇదే- లాంచ్​ ఎప్పుడంటే..!

Sharath Chitturi HT Telugu
Jun 17, 2024 02:37 PM IST

టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీపై మంచి బజ్​ నెలకొంది. ఇంకొన్ని నెలల్లో ఈ మోడల్​ లాంచ్​కానుంది. పూర్తి వివరాలు..

టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ వచ్చేస్తోంది..!
టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ వచ్చేస్తోంది..!

Tata Nexon iCNG launch : భారత్ మొబిలిటీ షో 2024లో ఆవిష్కరించిన టాటా నెక్సాన్ ఐసీఎన్​జీ,.. రాబోయే 6 నుంచి 8 నెలల్లో భారత మార్కెట్​లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ.. సీఎన్​జీ సెగ్మెంట్​లో గేమ్ ఛేంజర్​గా నిలవనుంది. ఇది భారతదేశంలో టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్​తో కనెక్ట్​ చేసిన తొలి సీఎన్​జీ వెహికిల్​గా నిలువవనుంది. ఈ నేపథ్యంలో.. ఈ టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ..

ఇండియాలో సీఎన్​జీ వెహికిల్స్​ మార్కెట్​ గణనీయంగా వృద్ధి చెందుతోంది. మారుతీ సుజుకీ.. ఈ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది. మారుతీ సుజుకీకి పోటీగా.. పలు మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు టాటా మోటార్స్​ రెడీ అవుతోంది. ఇందులో టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ ఒకటి. 

నెక్సాన్ ఐసీఎన్​జీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్​తో పనిచేస్తుంది. సీఎన్​జీ మోడ్​లో జనరేట్​ అయ్యే పవర్​, టార్క్​ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఇంజిన్​.. 118 బీహెచ్​పీ పవర్​, 170 ఎన్ఎమ్ టర్క్​ని జనరేట్​ చేసే అవకాశం ఉంది. టర్బోఛార్జర్, సీఎన్​జీ టెక్నాలజీ కలయిక ప్రస్తుతం భారత మార్కెట్​లో లేదు, సాంప్రదాయ నేచురల్లీ ఆస్పిరేటెడ్ సీఎన్​జీ ఆప్షన్స్​తో పోలిస్తే ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.

ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్​జీ, టాటా పంచ్ ఐసీఎన్​జీ ఇప్పటికే ఉపయోగించిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్​ని.. ఈ టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీలో కూడా వాడే అవకాశం లేకపోలేదు.

టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ.. దాని పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే రూ .80,000 నుంచి రూ .1,00,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

Tata Nexon CNG launch in India : టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీలో పలు కీలక సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది. సీఎన్​జీ ఇంధనం నింపే సమయంలో ఇంజిన్​ను ఆటోమేటిక్​గా ఆఫ్ చేసే మైక్రో స్విచ్, గ్యాస్ ఎస్కేప్​లను తగ్గించడానికి సీఎన్​జీ కిట్​లోని లీక్ ప్రూఫ్ మెటీరియల్స్, ఓవర్ హీటింగ్ నుంచి రక్షించడానికి థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ వీటిలో కొన్ని కావచ్చు.

సిస్టెమ్​ కంట్రోల్​ని మెరుగుపరిచేందుకు.. టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీలో సింగిల్​, అడ్వాన్స్​డ్​ ఈసీయూ ఉండనుంది. డైరక్ట్​ సీఎన్​జీ స్టార్టింగ్​, ఆటోమెటిక్​ ఫ్యూయెల్​ స్విచ్​, మాడ్యులర్​ ఫ్యూయెల్​ ఫిల్టర్​ డిజైన్​, లీక్​ డిటెక్షన్​ సిస్టెమ్​ వంటివి ఇంకొన్ని ఫీచర్స్​గా ఉండొచ్చు.

నెక్సాన్ సీఎన్​జీ ప్రధాన పోటీదారు మారుతి సుజుకి బ్రెజా సీఎన్​జీ, ఫ్యాక్టరీ-అమర్చిన సీఎన్​జీ కిట్​తో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్​ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ 87బీహెచ్​పి పవర్, 121ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్సాన్ ఐసీఎన్​జీ టర్బోఛార్జ్​డ్ ఆప్షన్​తో పోలిస్తే పవర్​ తక్కువే! అదనంగా, నెక్సాన్ సీఎన్​జీ ట్విన్-సిలిండర్ సీఎన్​జీ సెటప్ స్పేస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. బ్రెజ్జా సీఎన్​జీతో పోలిస్తే సుమారు 230 లీటర్ల బూట్ స్పేస్​ ఇందులో ఉండనుంది.

టాటా నెక్సాన్​ సీఎన్​జీ వెహికిల్​కి సంబంధించిన ఇతర వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ ఈ వెహికిల్​పై మంచి బజ్​ నెలకొంది. దీని కోసం అందరు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు లాంచ్​ టైమ్​కి ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం