Bigg Boss Promo:వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు విష్ణుప్రియ వార్నింగ్ - సండే ఎపిసోడ్ లో స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వ‌బోతున్ననాగార్జున‌-bigg boss telugu sunday episode promo vishnu priya warns wild card entries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Promo:వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు విష్ణుప్రియ వార్నింగ్ - సండే ఎపిసోడ్ లో స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వ‌బోతున్ననాగార్జున‌

Bigg Boss Promo:వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు విష్ణుప్రియ వార్నింగ్ - సండే ఎపిసోడ్ లో స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వ‌బోతున్ననాగార్జున‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 06, 2024 12:32 PM IST

Bigg Boss Wild Card Entry: బిగ్‌బాస్ 8 తెలుగు లో వైల్డ్ కార్డ్ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది నేటి సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేయ‌బోతున్నాడు. సండే ఎపిసోడ్ తాలూకు కొత్త ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బిగ్‌బాస్ ప్రోమో
బిగ్‌బాస్ ప్రోమో

Bigg Boss Wild Card Entry: బిగ్‌బాస్ 8 తెలుగులో వైల్డ్ కార్డ్స్ ద్వారా మ‌రికొంద‌రు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. వారు ఎవ‌ర‌న్న‌ది సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేయ‌బోతున్నాడు. కొత్త కంటెస్టెంట్స్‌ను ఆడియెన్స్‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నాడు నాగార్జున‌.

ప్రోమో వైర‌ల్‌...

సండే ఎపిసోడ్ తాలూకు కొత్త ప్రోమో వైర‌ల్ అవుతోంది. ఈ ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు విష్ణుప్రియ‌, ప్రేర‌ణ‌తో పాటు పృథ్వీ వార్నింగ్ ఇస్తూ క‌నిపించారు. వైల్డ్ కార్డ్స్ అతిథి దేవోభ‌వ‌...రండి...మ‌ర్యాద‌ల‌తో మిమ్మ‌ల్ని మెప్పించి మెల్ల‌మెల్ల‌గా బ‌య‌ట‌కు పంపిస్తామ‌ని విష్ణు ప్రియ ఈ ప్రోమో చెప్పింది.

వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్‌ను హౌజ్ నుంచి పంపిచేసి నేను గెలుస్తాన‌ని ప్రేర‌ణ అన‌గా..వాళ్ల గురించి మీకు తెలియ‌దు..కానీ మీ గురించి వాళ్ల‌కు తెలుసు అంటూ నాగార్జున ఆమెకు స‌మాధాన‌మిచ్చాడు. సింహాన్ని గేట్ బ‌య‌టి నుంచి చూడ‌టానికి బాగుంటుంది. లోప‌లికి వ‌స్తే గేమ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని పృథ్వీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. మా వెప‌న్స్ మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం రెడీగా పెట్టుకున్నామ‌ని నిఖిల్ చెప్పాడు.

వెల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఎవ‌రు?

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం నాగార్జున ఇందులో చూపించ‌లేదు. వారి వాయిస్‌లు మాత్ర‌మే చూపించాడు. కొంద‌రి క‌ళ్లు, కాళ్లు లాంటివి చూపించి ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగించాడు. ఓ కంటెస్టెంట్ కూతురితో నాగార్జున మాట్లాడాడు. మొత్తం ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఎనిమిది మంది వీళ్లేనా...

గ‌త వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల మ‌ళ్లీ హౌజ్‌లో అడుగుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా న‌య‌ని పావ‌ని, అవినాష్‌, రోహిణి, మెహ‌బూబ్ షేక్‌, హ‌మిదా ఖాతూన్ ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.వారితో పాటు గౌత‌మ్ కృష్ణ‌, హ‌రితేజ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చివ‌ర‌లో ప్రోమోలో గంగ‌వ్వ క‌నిపించింది. ఆమె కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ డేట్‌...

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో పాటు ఈ వారం బిగ్‌బాస్‌లోకి ప‌లువురు హీరోహీరోయిన్లు సంద‌డి చేయ‌బోతున్నారు. స్వాగ్‌, జ‌న‌క అయితే గ‌న‌క‌తో పాటు మా నాన్న సూప‌ర్ హీరో సినిమాల టీమ్‌లు సంద‌డిచేయ‌బోతున్నాడు. ఈ ప్రోమోలో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అని దిల్‌రాజును నాగార్జున అడ‌గ‌టం ఆస‌క్తిని పంచుతుంది. బిగ్‌బాస్ ప్రోమోలో జ‌న‌క అయితే గ‌న‌క స్టోరీలైన్‌సు హీరో సుహాస్ రివీల్ చేశాడు.

Whats_app_banner