Bigg Boss Divi: బిగ్‌బాస్‌కు వెళితే కెరీర్ క్లోజ్ - బాయ్‌ఫ్రెండ్ లేకుండా షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా- బిగ్‌బాస్ దివి-bigg boss divi interesting comments on missing an opportunity in ravi tejas movie as heroine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Divi: బిగ్‌బాస్‌కు వెళితే కెరీర్ క్లోజ్ - బాయ్‌ఫ్రెండ్ లేకుండా షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా- బిగ్‌బాస్ దివి

Bigg Boss Divi: బిగ్‌బాస్‌కు వెళితే కెరీర్ క్లోజ్ - బాయ్‌ఫ్రెండ్ లేకుండా షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా- బిగ్‌బాస్ దివి

Nelki Naresh Kumar HT Telugu
Mar 27, 2024 08:12 AM IST

Bigg Boss Divi: ర‌వితేజ సినిమాలో త‌న‌కు హీరోయిన్‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని బిగ్‌బాస్ దివి అన్న‌ది. కార‌ణం చెప్ప‌కుండా ఆ సినిమా నుంచి త‌న‌ను ప‌క్క‌న‌పెట్ట‌డంతో ఎన్నో రోజులు ఏడ్చాన‌ని బిగ్‌బాస్ దివి చెప్పింది.

బిగ్‌బాస్ దివి
బిగ్‌బాస్ దివి

Bigg Boss Divi: ఇండ‌స్ట్రీలో స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో చాలా రోజుల పాటు ఏడ్చాన‌ని బిగ్‌బాస్ దివి చెప్పింది. ర‌వితేజ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని, ఆ త‌ర్వాత త‌న‌ను ఆ సినిమా నుంచి తొల‌గించార‌ని చెప్పింది. త‌న కెరీర్ గురించి ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌...

ర‌వితేజ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా న‌న్ను మూవీ టీమ్ సెలెక్ట్ చేశార‌ని బిగ్‌బాస్ దివి అన్న‌ది. ర‌వితేజ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ని తెలియ‌గానే ఆనందంతో క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని చెప్పింది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఎలా మాట్లాడాలో స్పీచ్‌లు కూడా ప్రిపేర్ అయ్యాన‌ని తెలిపింది.

ర‌వితేజ మూవీ కోసం లుక్ టెస్ట్ అటెండ్ అయ్యాన‌ని, తాను కూడా సొంతంగా కొన్ని ఫొటోషూట్‌లు చేశాన‌ని చెప్పింది. అంత క‌ష్ట‌ప‌డిన త‌ర్వాత ఆ సినిమా నుంచి త‌న‌ను తీసేశార‌ని బిగ్‌బాస్ దివి చెప్పింది. ఆ అవ‌కాశం చేజార‌డంతో చాలా హ‌ర్ట్ అయ్యాన‌ని తెలిపింది. ర‌వితేజ ప‌క్క‌న హీరోయిన్‌గా సినిమా అంటే నా కెరీర్ సెట్ అయిపోతుంద‌ని క‌ల‌లు క‌న్నాన‌ని దివి తెలిపింది. కానీ అది నిజం కాలేద‌ని అన్న‌ది.

బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌గ‌ల‌రు...

తెలుగు అమ్మాయిల‌కు హాట్‌, బోల్డ్ పాత్ర‌లు కూడా చేయ‌గ‌ల‌ర‌ని, యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లు చేసే స‌త్తా వారికి ఉంద‌ని తెలిపింది. కానీ తెలుగు అమ్మాయిల‌కు ఎవ‌రూ స‌రైన అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని బిగ్‌బాస్ దివి అన్న‌ది. తెలుగు అమ్మాయిల‌కు తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తే బాగుంటుంద‌ని దివి తెలిపింది.

బిగ్‌బాస్‌కు వెళ్ల‌కూడ‌ద‌ని అనుకున్నా...

బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది దివి. బిగ్‌బాస్‌లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఈ షోకు వెళ్ల‌కూడ‌ద‌ని అనిపించింద‌ని దివి తెలిపింది. బిగ్‌బాస్‌కు వెళితే నా కెరీర్ పూర్తిగా క్లోజ్ అవుతుంద‌ని భ‌య‌ప‌డ్డాన‌ని అన్న‌ది. బిగ్‌బాస్‌లో పాల్గొన‌డానికి ముందు ఐదారు సినిమాలు చేశా. ఈ షోకు వెళితే అలాంటి అవ‌కాశాలు కూడా రావేమోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని బిగ్‌బాస్ దివి అన్న‌ది.

బిగ్‌బాస్‌కు వెళ్లాలా లేదా అనే విష‌యంలో చాలా మంది స‌ల‌హాలు తీసుకున్న త‌ర్వాత షోకు ఒకే చెప్పా. బిగ్‌బాస్ ద్వారా నాకు ఎలాంటి బ్యాడ్‌నేమ్ రాకూడ‌ద‌ని ఫిక్స్ అయ్యా. అందుకే షోలో ఎలాంటి ల‌వ్ ఎఫైర్స్ పెట్టుకోలేదు. బ‌హుషా బాయ్‌ఫ్రెండ్స్ లేకుండానే బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏకైక కంటెస్టెంట్ నేనే కావ‌చ్చున‌ని దివి తెలిపింది.

అస్థిర‌త ఎక్కువ‌.

బిగ్‌బాస్ త‌ర్వాత కూడా చాలా సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయాయ‌ని దివి తెలిపింది.

ఓ సినిమాలో అవ‌కాశం వ‌చ్చిందంటే అదే క‌న్ఫామ్ అని కాద‌ని అన్న‌ది. ఇండ‌స్ట్రీలో అస్థిర‌త ఎక్కువ‌ని, మ‌న‌దే అనుకున్న ప్లేస్‌లో ఎవ‌రైన క‌నిపించ‌వ‌చ్చ‌ని దివి తెలిపింది. అవ‌కాశాల‌ను కోల్పోకూడ‌ద‌నే మేక‌ర్స్‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండాలి. వారిని బ‌తిమిలాడాలి, గ్రౌండెడ్‌గా ఉండాలి ఇలా ఎన్నో చేయాల‌ని అన్న‌ది.

న‌క్స‌లైట్ పాత్ర‌లో...

లంబ‌సింగి సినిమాలో న‌క్స‌లైట్ పాత్ర‌లో దివి న‌టించింది. గ్లామ‌ర్ పంథాకు భిన్నంగా కంప్లీట్‌గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌, న‌యీం డైరీస్‌, రుద్రంగి, జిన్నాతో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది దివి. మీ నీళ్ల ట్యాంక్‌, ఏటీఎమ్ వెబ్‌సిరీస్‌ల‌లో లీడ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించింది.

టాపిక్