Ayesha Khan: మాతో చెప్ప‌కుండా బిగ్‌బాస్‌కు వెళ్లిపోయింది - బాలీవుడ్ బ్యూటీపై శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్‌-sree vishnu shocking comments on bigg boss 17 beauty ayesha khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ayesha Khan: మాతో చెప్ప‌కుండా బిగ్‌బాస్‌కు వెళ్లిపోయింది - బాలీవుడ్ బ్యూటీపై శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్‌

Ayesha Khan: మాతో చెప్ప‌కుండా బిగ్‌బాస్‌కు వెళ్లిపోయింది - బాలీవుడ్ బ్యూటీపై శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 21, 2024 08:43 AM IST

Ayesha Khan: బిగ్‌బాస్ 17 బ్యూటీ ఆయేషాఖాన్‌పై శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం భీమ్ బుష్‌లో ఐటెంసాంగ్ చేయాల్సివుండ‌గా త‌మ‌కు చెప్ప‌కుండానే ఆయేషాఖాన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న‌ద‌ని శ్రీవిష్ణు అన్నాడు.

అయేషాఖాన్‌
అయేషాఖాన్‌

Ayesha Khan: బిగ్‌బాస్ బ్యూటీ అయేషాఖాన్‌పై హీరో శ్రీవిష్ణు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. శ్రీవిష్ణు హీరోగా న‌టించిన ఓం భీమ్ బుష్ మార్చి 22న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హుషారు ఫేమ్ శ్రీహ‌ర్ష కొనుగంటి ఓ భీం బుష్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

yearly horoscope entry point

ఆయేషాఖాన్ స్పెష‌ల్ సాంగ్‌...

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయేషాఖాన్‌స్పెష‌ల్ సాంగ్ చేసింది. సాంగ్ షూటింగ్‌కు ముందు అయేషాఖాన్‌ సినిమా యూనిట్‌కు షాకిచ్చింద‌ట‌. ఎవ‌రికి చెప్ప‌కుండా బిగ్‌బాస్‌షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ట్లు శ్రీవిష్ణు తెలిపాడు. ఆయేషాఖాన్ వ‌ల్ల కొన్నాళ్లు ఓ భీమ్ బుష్‌ షూటింగ్ ఆల‌స్య‌మైన‌ట్లు తెలిపాడు.

బిగ్‌బాస్‌లో త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చిన విష‌యం అయేషాఖాన్‌ మాకే కాదు ఎవ‌రికి చెప్ప‌లేద‌ని ఓంభీమ్‌బుష్ ప్ర‌మోష‌న్స్‌లో శ్రీవిష్ణు చెప్పాడు. ఓం భీమ్ బుష్‌లో ఆయేషాఖాన్ ఓ పాట‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని శ్రీవిష్ణు అన్నాడు. సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం చిత్ర యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కు స‌స్పెన్స్‌లో ఉంచారు.

బిగ్‌బాస్ 17లో కంటెస్టెంట్‌గా...

ఇటీవ‌ల ముగిసిన హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 17 లో ఓ కంటెస్టెంట్‌గా అయేషాఖాన్‌ పాల్గొన్న‌ది. టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌రిగా బ‌రిలోకి దిగిన ఈ మూవీ 64వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

ఆ త‌ర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా సేఫ్ అయిన హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. రీఎంట్రీ త‌ర్వాత కూడా ఎక్కువ రోజుల పాటు హౌజ్‌లో కొన‌సాగ‌లేక‌పోయింది. 78 రోజు అయేషాఖాన్‌ బిగ్‌బాస్ 17 జ‌ర్నీ ముగిసింది. షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.

టాలీవుడ్‌లోకి...

హిందీ బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో తెలుగులో చ‌క్క‌టి అవ‌కాశాల‌ను అందుకుంటున్న‌ది అయేషాఖాన్‌. ముఖ‌చిత్రం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టు కాక‌పోయినా ఐటెంసాంగ్స్‌లో ఆమెకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి.

ఓ భీమ్ బుష్‌తో పాటు విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీ భాస్క‌ర్‌ల‌లో ఆయేషాఖాన్ స్పెష‌ల్ సాంగ్స్ చేస్తోంది. బిగ్‌బాస్ త‌ర్వాత అయేషాఖాన్‌ ఖ‌త్రోంకీ ఖిలాడీషోలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతున్న‌ది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...

భైర‌వ‌పురం అనే ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓం భీమ్ బుష్ సినిమాను ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి తెర‌కెక్కిస్తోన్నారు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా సినిమా మొత్తం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగ‌బోతున్న‌ట్లు తెలిసింది. యూవీ క్రియేష‌న్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థ‌లు ఈ మూవీని నిర్మిస్తోన్నాయి. ఓం భీమ్ బుష్ సినిమాకు స‌న్నీ ఎంఆర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

Whats_app_banner