Lambasingi Movie Review: లంబసింగి రివ్యూ - బిగ్‌బాస్ దివి నక్సలైట్‌గా నటించిన సినిమా ఎలా ఉందంటే?
బిగ్‌బాస్ దివి, భరత్‌రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన లంబసింగి మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు.
Lambasingi Movie Review: బిగ్‌బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో నటించిన లంబసింగి మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. సోగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు. భరత్ రాజ్ హీరోగా నటించాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
లంబసింగి ప్రేమకథ...
లంబసింగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు వీరబాబు (భరత్‌రాజ్). తొలిచూపులోనే హరిత(దివి) అనే నర్సును చూసి ప్రేమలో పడతాడు. హరిత...కోనప్ప అనే నక్సలైట్ లీడర్ కూతురు అని వీరబాబుకు తెలుస్తుంది. హరితకు తన ప్రేమను ప్రపోజ్ చేస్తాడు వీరబాబు.
కానీ ఆమె మాత్రం వీరబాబు ప్రపోజల్‌కు నో చెబుతుంది. ఓ రోజు వీరబాబు డ్యూటీలో ఉండగా లంబసింగి పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్లు దాడిచేస్తారు. ఆ దళం సభ్యుల్లో కోనప్పతో పాటు హరిత కూడా ఉంటుంది. ఆమె నర్సు కాదు నక్సలైట్ అనే నిజం తెలిసి వీరబాబు ఏం చేశాడు? వీరబాబు ప్రేమను హరిత అర్థం చేసుకుందా? హరితను దళం సభ్యులు ఎందుకు అనుమానించారు? వీరబాబు ప్రేమ కోసం ఆమె ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? అన్నదే లంబసింగి కథ.
ప్రేమకథతో...
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ మూవీస్ ఎక్కువగా వచ్చాయి. ఈ సీరియస్ ఇష్యూను కమర్షియల్ కోణంలో చెప్పే సాహసాన్ని దర్శకులు ఎక్కువ చేయలేకపోయారు. లంబసింగితో దర్శకుడు నవీన్ గాంధీ ఆ రిస్క్ చేశారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు స్వచ్ఛమైన ప్రేమకథను జోడించి లంబసింగి సినిమాను తెరకెక్కించాడు. ఓ లేడీ నక్సలైట్‌తో ప్రేమలో పడిన కానిస్టేబుల్ పాయింట్‌తో ఈ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్‌ను కన్వీన్సింగ్‌గా చెప్పడంలో కొంత వరకు డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఎమోషనల్ క్లైమాక్స్...
వీరబాబు కానిస్టేబుల్‌గా లంబసింగ్ రావడం, హరితతో ప్రేమలో పడే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. లంబసింగి అందాలను జతచేస్తూ లవ్ స్టోరీని ఆహ్లాదభరితంగా నడిపించారు.
హరిత క్యారెక్టర్ సంబంధించి వచ్చే ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్‌లో తన ప్రేమను దక్కించుకోవడానికి వీరబాబు చేసే ప్రయత్నాలు చుట్టూ నడుస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది. రొటీన్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా విషాదాంతంగా ఎండ్ చేశారు.
ఫస్ట్ హాఫ్‌లో హీరోహీరోయిన్ల ప్రేమ ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని చోట్ల ఈ మూవీ సాయిపల్లవి విరాటపర్వం సినిమాను గుర్తుకు తెస్తుంది.
దివి ప్లస్ పాయింట్...
ఈ సినిమాకు యాక్టింగ్ పరంగా దివి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కథ మొత్తం ఆమె పాత్ర నేపథ్యంలోనే సాగుతుంది. బరువైన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడింది. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయగలుగుతుందనే ముద్ర నుంచి దివి దూరమయ్యేందుకు లంబసింగి కొంత వరకు హెల్ప్ చేస్తుంది.
కానిస్టేబుల్‌గా హీరో భరత్‌రాజ్ నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు. మిగిలిన పాత్రధారలందరూ కొత్తవాళ్లే అయినా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్ ధ్రువన్ పాటలు, బీజీఎమ్ లంబసింగి కథకు ప్రాణం పోసింది. పాటలు బాగున్నాయి. నిడివి కూడా రెండు గంటల రెండు నిమిషాలే కావడం కూడా ప్లస్సయింది.
రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా...
లంబసింగి రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే ఓ డిఫరెంట్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. బిగ్‌బాస్ దివి కోసం ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
టాపిక్