Bigg Boss Aditya Om: ‘మనిషివా.. జంతువువా’: బయట కూడా మణికంఠపై ఆదిత్య ఓం ఫైర్
Bigg Boss Aditya Om: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఐదో వారం మిడ్‍వీక్‍లోనే ఎలిమినేట్ అయ్యారు. షాకింగ్‍గా బయటికి వచ్చేశారు. ఆదిత్యతో బిగ్‍బాస్ ఇంటర్వ్యూ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. మణికంఠపై ఓ రేంజ్‍లో ఆదిత్య ఫైర్ అయ్యారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి సినీ నటుడు ఆదిత్య ఓం సడెన్‍గా నిష్క్రమించారు. ఐదో వారం మిడ్‍వీక్‍లోనే ఎలిమినేట్ అయిపోయారు. ఊహించిన విధంగా వారం మధ్యలోనే బయటికి రావటంతో నిరాశచెందారు. ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓంను బిగ్‍బాస్ బజ్‍లో ఇంటర్వ్యూ చేశారు అంబటి అర్జున్. హౌస్‍లో విషయాల గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో వచ్చింది.
ఆవగింజంత ఇన్వాల్వ్‌మెంట్
ఆకాశమంత అంచనాలు పెట్టుకుంటే.. హౌస్‍లో అవగింజంత మాత్రమే ఇనాల్వ్ అయ్యారంటూ ఆదిత్య ఓంకు అంబటి అర్జున్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. దీంతోనే ఈ ప్రోమో షురూ అయింది. “ఈయన ఇమాజినేషన్ ఏమో ఆకాశమంత.. ఇన్వాల్వ్‌మెంట్ ఏమో ఆవగింజంత. ఆటలో ఆవేశం కన్నా మాటలో మంచితనం మిన్న అనేదే ఈయన పాలసీ” అంటూ ఆదిత్యకు వెల్‍కమ్ చెప్పారు అర్జున్.
పెద్ద సైకాలజీ టెస్ట్.. అదే నవ్వు
కరాటే అంటే ఇష్టమని హౌస్‍లో చెప్పారని ఆదిత్యకు అర్జున్ గుర్తు చేశారు. కరాటే నేర్పించాలని అడిగితే.. ఆదిత్య సరదాగా ఓ టిప్ చెప్పారు. హౌస్‍లో జర్నీని ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెబుతారని అర్జున్ అడిగారు. దీంతో “అది ఒక పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్” అని ఆదిత్య చెప్పారు.
మరి ఆ టెస్టులో పాసయ్యారా అని అర్జున్ అడిగితే.. ఆదిత్య నవ్వారు. ఇదేమైనా పొగడ్త అనుకుంటున్నారా అని అర్జున్ సరదాగా అన్నారు. హౌస్‍లో గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాగార్జున ఓ సందర్భంలో ఆదిత్యతో చెప్పగా అలాగే నవ్వారు. ఇప్పుడు కూడా ఇలాగే చేయడంతో అది గుర్తుకు వచ్చేలా అర్జున్ ఆ పొగడ్త డైలాగ్ ఉన్నారు.
హౌస్‍లో గొడవలపై..
కావాలని గొడవ పడడం, యాక్ట్ చేసే వాళ్లు ఎవరైనా ఉన్నారా హౌస్‍లో అని అంబటి అర్జున్ అడిగారు. దీంతో చాలా మంది ఉన్నారని ఆదిత్య చెప్పారు. గొడవలు పడే కంటెంటే ముఖ్యమని వారు అనుకుంటున్నారని తెలిపారు. నబీల్ మెగా చీఫ్ అయ్యాక.. ప్రేరణను యష్మి అనవసరంగా తిట్టారని చెప్పారు.
ట్రై చేశా.. పొరపాటు అంగీకరిస్తున్నా..
హౌస్‍లో బాగా ఆడాలని తాను చాలా ట్రై చేశానని ఆదిత్య చెప్పారు. ట్రై చేసినట్టు కూడా తనకు అనిపించలేదని అర్జున్ అన్నారు. బ్లాక్‍బస్టర్ పర్ఫార్మెన్స్ ఊహించానని చెప్పారు. చీఫ్ అవ్వాలని లేదని నబీల్‍తో అన్నారని, కానీ చీఫ్ అంటే పెద్ద విషయం కదా అని అర్జున్ ప్రశ్నించారు. తాను ఆ పొరపాటును అంగీకరిస్తున్నానని ఆదిత్య చెప్పారు.
తాను స్టార్ట్ చేసినప్పుడే ఎలిమినేట్ అయ్యానని ఆదిత్య అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏ లాభం అంటున్నారని అర్జున్ అన్నారు. అవకాశాన్ని సృష్టించుకోవాలా.. వస్తుందని ఎదురుచూడాలా అని ప్రశ్నించారు.
భయపెడ్డారని అనిపించింది
ఎదుటి వారు నామినేట్ చేసినప్పుడు కౌంటర్ ఇవ్వలేకపోయారని, భయపడ్డారని తనకు అనిపించిందని అర్జున్ సూటిగా అడిగారు. ఎస్, ఓకే, లవ్యూ అంటూ ఎందుకు అన్నారని క్వశ్చన్ చేశారు. మూడు క్లాన్‍లు మారినా ఎక్కడా స్ట్రాంగ్ పాయింట్ చెప్పినట్టు కనిపించలేదని అన్నారు. నిఖిల్, పృథ్వి, సోనియాను వ్యతిరేకించి వేరే క్లాన్‍కు వెళ్లినా.. వారికి పెద్దగా పోటీ ఇచ్చినట్టు కనిపించలేదని ఆదిత్యను అడిగారు.
తాను ఉన్న క్లాన్‍ల్లో చీఫ్‍లు తనను పట్టించుకోలేదనేలా ఆదిత్య చెప్పారు. అభయ్, సీత ఇద్దరూ ఉన్నప్పుడు ఇలాగే జరిగిందని అన్నారు. వెన్నుపోటు పొడిచిన సీత అంటూ అర్జున్ అన్నారు. ప్రేరణ నామినేట్ చేసినప్పుడు మంటల్లో ఫొటో చేయి పెట్టి తీసినప్పుడు హీరో ఎలివేషన్ కనపడిందని అర్జున్ అన్నారు.
మణికంఠపై ఆగ్రహం
క్లాన్ చీఫ్ అయితే హౌస్‍లోని వారిలో ఏ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారని, ఎవరిని వద్దనుకుంటారనే గేమ్‍ను ఆదిత్యతో అర్జున్ అడించారు. నబీల్, వృథ్వి, సీతను ఆదిత్య సెలెక్ట్ చేసుకున్నట్టు ప్రోమోలో ఉంది. హౌస్‍కు సీతనే సోల్ అంటూ ఆదిత్య ప్రశంసించారు. వెన్నుపోటు పొడిచినా పర్లేదంటారా అని అర్జున్ జోక్ చేశారు.
హౌస్‍లో తాను ఇచ్చిన సలహాలను మణికంఠ ఎప్పుడూ సరిగా తీసుకోలేదంటూ ఆదిత్య ఫైర్ అయ్యారు. “అసలు మణికంఠ.. నువ్వు మనిషివా.. జంతువువా.. నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చి కరెక్ట్ సలహాలు ఇచ్చాను. నేను ఇచ్చిన సహకారం, సలహాలు సరిగా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటారు లైప్‍లో.. చిన్న బుర్ర ఉందా మీకు” అని ఆదిత్య ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ సోమవారం రానుంది.