Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!-bigg boss telugu 8 this week elimination contestant aditya om remuneration in 33 days bigg boss 8 telugu remuneration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!

Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Aditya Om Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఆదిత్య ఓం నాలుగు వారాలకుపైగా అంటే సుమారుగా 33 రోజులపాటు ఉన్నాడు. ఈ 33 రోజుల్లో హీరో ఆదిత్య ఓం ఎంత సంపాదించడానే వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!

Bigg Boss Telugu 8 Fifth Elimination Aditya Om: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. మొన్నటివరకు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్‌లో నైనిక ఎలిమినేట్ అవుతుందని న్యూస్ జోరుగా ప్రచారం జరిగింది.

ఆదిత్యం ఓం ఎలిమినేషన్

కానీ, అనుకోకుండా ఊహించని విధంగా ఐదో వారం మిడ్ వీక్‌లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ బుధవారం (అక్టోబర్ 2) నాడు రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను గురువారం అంటే ఇవాళ (అక్టోబర్ 3) స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు.

ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ- ఎలిమినేషన్

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ద్వారా హీరో ఆదిత్యం ఓం ఎంత సంపాదించాడనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్‌లో హౌజ్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓం అడుగుపెట్టాడు. ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన ఐదో కంటెస్టెంట్‌గా ఆదిత్యం ఓం నిలవడం విశేషంగా మారింది.

వారానికి ఎన్ని లక్షలంటే

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో పార్టిస్‌పేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి రూ. 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే, రోజుకు సుమారుగా 42 వేల 857 రూపాయలు. అయితే, ఆదిత్యం ఓం బిగ్ బాస్ హౌజ్‌లో నాలుగు వారాలకు పైగా ఉన్నాడు. సెప్టెంబర్ 1వ తేది నుంచి చూస్తే.. అక్టోబర్ 3 వరకు 33 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో కొనసాగాడు ఆదిత్య ఓం.

వారికంటే ఎక్కువ

ఈ లెక్కన 33 రోజుల్లో ఆదిత్య ఓం రూ. 14 లక్షల 14 వేల 281 పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదివరకు ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన బెజవాడ బేబక్క (వారానికి రూ. 1,50,000), ఆర్జే శేఖర్ బాషా వారానికి రూ. రెండున్నర లక్షలు, అభయ్ నవీన్ (వారానికి రెండు లక్షలు), సోనియా ఆకుల (వారానికి రూ. లక్షా యాభైవేలు) పారితోషికం కంటే ఆదిత్య ఓం అందుకున్న రెమ్యునరేషన్ ఎక్కువ.

విష్ణుప్రియ తర్వాత ఆదిత్య

హౌజ్‌లో విష్ణుప్రియ తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఆదిత్య ఓం. యాంకర్ విష్ణుప్రియకు వారానికి రూ. 4 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. కాబట్టి, ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పోల్చితే.. ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓం నిలిచాడు.

లేని అధికారిక ప్రకటన

ఇదిలా ఉంటే, ఆదిత్యం ఓం బిగ్ బాస్ రెమ్యునరేషన్‌పై మరో టాక్ కూడా నడుస్తోంది. ఆదిత్యం ఓం వారానికి రూ. 3 లక్షలు కాకుండా రూ. 5 లక్షలు అందుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు రూ. 71,428 తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే గనుక ఆదిత్య ఓంకు బిగ్ బాస్ ద్వారా 33 రోజుల్లో రూ. 23, 57,000 వరకు అందినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, ఈ రెమ్యునరేషన్ వివరాలు ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు.