Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?-horror to crime thriller ott movies web series streaming on netflix in october top upcoming ott release the goat to ctrl ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 02, 2024 02:29 PM IST

Up Coming Top 6 OTT Movies Release In Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ నెలలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఉన్నాయి. వీటన్నింటిలో టాప్ 6 సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?

Netflix OTT Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది నెట్‌ఫ్లిక్స్. ఇందులో వచ్చే సరికొత్త కంటెంట్ ఎప్పుడు మూవీ లవర్స్‌ను, ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే సినిమాలు, వెబ్ సిరీసుల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలా అక్టోబర్‌లో ఓటీటీ రిలీజ్ అవుతున్న టాప్ 6 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

CTRL (కంట్రోల్ ఓటీటీ)

అనన్య పాండే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా సీటీఆర్ఎల్ (కంట్రోల్ అని కూడా పిలవచ్చు). విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమా సైబర్-థ్రిల్లర్ కథాంశంతో ఉంటుంది. ఇందులో ఏఐతో వర్క్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అనన్య పాండే కనిపించనుంది.

ప్రస్తుతం నేటి సమాజంలో ఉన్న సంఘటనలను చెప్పే థీమ్‌తో ఏఐ లాభాలు, నష్టాల కాన్సెప్ట్‌తో వచ్చిన సీటీఆర్ఎల్ సినిమా అక్టోబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ది గోట్ ఓటీటీ

ఇళయ దళపతి విజయ్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, త్రిష కృష్ణన్, అజ్మల్ అమీర్ వంటి స్టార్స్ నటించిన ది గోట్ సినిమా అక్టోబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

ది సీక్రెట్ ఆఫ్ ది రివర్ ఓటీటీ

'ది సీక్రెట్ ఆఫ్ ది రివర్' ఊహించని స్నేహాం, డార్క్ సీక్రెట్, వచ్చే సంక్షోభాలు వంటి ఎలిమెంట్స్‌తో తెరెకక్కిన మినీ వెబ్ సిరీస్ ది సీక్రెట్ ఆఫ్ ది రివర్. మెక్సికోలోని ఒక చిన్న పట్టణంలో నివసించే మాన్యుయెల్, ఎరిక్ మధ్య, వారిలో ఉండే జరిగే తెలియని నిజంపై ఇది తెరకెక్కింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

లోన్లీ ప్లానెట్ ఓటీటీ

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సినిమా లోన్లీ ప్లానెట్. లారా డెర్న్, లియామ్ హేమ్స్‌వర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుసన్నా గ్రాంట్ దర్శకత్వం వహించారు. ఒంటరిగా ఉన్న మహిళా రచయిత అనుకోకుండా ఓ యువకుడిని కలుసుకుంటుంది. ఆ తర్వాత వారి ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం, చోటు చేసుకున్న పరిస్థితులతో సినిమా సాగుతుంది. లోన్లీ ప్లానెట్ అక్టోబర్ 11న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ 3

గ్యాంగ్ థ్రిల్లింగ్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ సరికొత్త ట్విస్ట్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. భావనా ​​పాండే, మహీప్ కపూర్, నీలం కొఠారి సోనీ, సీమా కిరణ్ సజ్దేహ్ నటించిన ఈ సిరీస్‌ సీజన్ 3లోకి కొత్తగా రిద్ధిమా కపూర్ సాహ్ని, షాలిని పాసి, కళ్యాణి సాహా చావ్లా అడుగుపెట్టారు. ఈ కొత్త సీజన్ అక్టోబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

ది ప్లాట్‌ఫామ్ 2 ఓటీటీ

సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా ది ప్లాట్‌ఫామ్ 2. సూపర్ హిట్ అయిన ది ప్లాట్‌ఫామ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పొడవు గదులు ఉండే ఓ జైలులో ఖైదీలు ఉంటారు. అక్కడ ఆహారం కోసం ఖైదీలు కొట్టుకోవడం, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో ఈ చిత్రాన్ని గాల్డర్ గజ్టేలు ఉర్రుషియా తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 4న ది ప్లాట్‌ఫామ్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.