Bigg Boss Vishnupriya: గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ.. నిఖిల్‌పై విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్
Bigg Boss Telugu 8 Vishnupriya About Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పెరిగుపోతున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో నిఖిల్‌పై యాంకర్ విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్ చేసింది గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ అంటూ మండిపడింది.
Bigg Boss 8 Telugu Anchor Vishnupriya: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. హౌజ్‌లోకి రెండు మూడు వారాల్లో 12 మంది వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇస్తారని బిగ్ బాస్ చెప్పారు. ఆ 12 మందిని ఆపి, హౌజ్‌లో ఉన్న వాళ్లు బయటకు ఎలిమినేట్ అయి వెళ్లకుండా ఉండేందుకు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఇచ్చాడు బిగ్ బాస్.
45 నిమిషాల్లో బిర్యానీ
ఈ క్రమంలోనే ఇచ్చిన బెలూన్ టాస్క్‌లో సీత క్లాన్ విన్ అయింది. దాంతో నిఖిల్ క్లాన్ నుంచి ఒకరిని తప్పించాలని, అది తన టీమ్ డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిర్యానీ టాస్క్ ఇస్తే 45 నిమిషాల్లో పూర్తి చేయలేక సోనియా, నబీల్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు.
అనర్హులు అనుకునేవారు
బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో పట్టుకునే ఉండు లేకపోతే పగిలిపోతుంది అని ఇచ్చిన టాస్క్‌లో పృథ్వీ గెలిచాడు. దాంతో ఓడిపోయిన సీత క్లాన్‌లో నుంచి అనర్హులు అనుకునేవారిని తీసివేయాలని, అది నిఖిల్ టీమ్ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో నిఖిల్ క్లాన్ నిర్ణయించి నబీల్‌ను టాస్క్ నుంచి తీసేశారు.
రెండు మొహాలు
నబీల్‌ను తీసేయడంతో సీత క్లాన్ చాలా డిసాప్పాయింట్ అయింది. అంతా నిఖిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "నిన్న టాస్క్‌లో ఇది వైల్డ్ కార్డ్స్‌ను ఆపడానికి అని చెప్పి ఇవాళ నబీల్‌ను తీస్తార. ఇలాంటి టూ ఫేస్‌డ్ మొహం ఉన్న వ్యక్తిని చూడలేదు" అనుకుంటూ విష్ణుప్రియ వెళ్లిపోయింది. దానికి "నీకు అలా అనిపిస్తుందా. థ్యాంక్యూ" అని నిఖిల్ చెప్పాడు.
వైల్డ్ కార్డ్స్ రాకుండా
అనంతరం నబీల్‌ను ఎందుకు తీశావ్ అని కిర్రాక్ సీత అడిగింది. "ఇక్కడ వద్దు. పర్సనల్‌గా తనకు చెప్పు" అని పృథ్వీ అనడంతో సీతను పక్కకు తీసుకెళ్లి ఎక్స్‌ప్లెన్ చేస్తాడు నిఖిల్. దానికి ఎంతమాత్రం సీత ఒప్పుకోదు. "నిన్న ఇది వైల్డ్ కార్డ్స్ వర్సెస్ మనం అని చెప్పాం. అంతా కలిసి ఆడాలి. వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయాలి అని, ఇప్పుడు నీ టీమ్‌ను ప్రొటెక్ట్ చేసుకుంటానంటావేంటీ" అని సీత వెళ్లిపోయింది.
బొట్టు పెట్టుకోవడం
ఇదే విషయం తన క్లాన్‌తో చెబుతుంది సీత. అంటే, ఇప్పుడు వాళ్ల దృష్టిలో నేను అనర్హుడినా అని నబీల్ అన్నాడు. "ఆయన గేమ్ ఆడుతున్నాడు. చీఫ్ పొజిషన్‌లో ఉండి చీప్‍గా బిహేవ్ చేస్తున్నాడు. చేతులు కట్టుకుని, రెడ్ బ్యాంగిల్స్, బొట్టు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ. అలా అని నేను ఆడవాళ్లు తక్కువ చేయట్లేదు" అని విష్ణుప్రియ కామెంట్స్ చేసింది.
డంబ్ అనేగా
"తను ఇద్దరు దగ్గరికే వెళ్లి వాళ్లను అడిగి నిర్ణయం తీసుకుంటున్నాడు" అని నైనిక చెప్పింది. "అలా అంటే డంబ్ అనేగా. తనకు నిర్ణయం తీసుకురానప్పుడు ఎందుకు" అని ప్రేరణ అంది. ఇలా ప్రతి ఒక్కరు నిఖిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నిఖిల్ క్లాన్ వర్సెస్ నాగ మణికంఠ కూడా జరిగింది.