Bigg Boss Elimination Today: బిగ్ బాస్ ఓటింగ్‌లో నబీల్ టాప్.. ఇవాళే మిడ్ వీక్ ఎలిమినేషన్.. మధ్యలో వెళ్లిపోయేది ఎవరంటే?
Bigg Boss Telugu 8 Mid Week Elimination And 5th Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్ ఓటింగ్‌లో వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది టాప్‌లో దూసుకుపోతూ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంతకుముందు యాంకర్ విష్ణుప్రియ, నిఖిల్‌కు వచ్చిన వచ్చిన ఓటింగ్ కంటే ఎక్కువగా సంపాదించి సత్తా చాటాడు.
Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఐదో వారం నామినేషన్స్ కూడా రచ్చగానే సాగాయి. ఈ నామినేషన్స్‌లో యష్మీ వర్సెస్ మణికంఠ బాగానే జరిగింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటంతో ఐదోవారం నామినేషన్స్ కూడా సోమవారం (సెప్టెంబర్ 30) ఒక్కరోజునే జరిగాయి.
ఇంటి సభ్యులు చెప్పాలని
బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం ఉన్నారు. అయితే, వీరిలో చీఫ్ అయిన నిఖిల్ హౌజ్‌మేట్స్ అందరితో నామినేట్ అయ్యాడు. సీత, నిఖిల్ క్లాన్స్‌కు చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరిలో ఎవరు నామినేట్ కావాలనేది ఇంటి సభ్యులు చర్చించి చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు.
టాప్‌లో నబీల్
దాంతో హౌజ్‌మేట్స్ అంతా నిర్ణయించి నిఖిల్‌ను ఐదో వారం నామినేషన్స్‌లో పడేశారు. అలా ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వారికి సెప్టెంబర్ 30 నుంచి ఓటింగ్ పోల్ నమోదు అయింది. వారిలో అందరికంటే టాప్‌లో బిగ్ బాస్ ఓటింగ్‌లో సత్తా చాటుతున్నాడు నబీల్ అఫ్రిది. మిగతా కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓట్లతో మెజారిటీలో ఉన్నాడు.
నిఖిల్ కంటే ఎక్కువగా
బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్ కంటే ఎక్కువ ఓటింగ్‌తో అదరగొడుతున్నాడు. 26.12 శాతం (22,287 ఓట్లు) ఓటింగ్‌తో నబీల్ మొదటి స్థానంలో ఉంటే.. నిఖిల్ 25.23 శాతం (21,530) ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇక నాగ మణికంఠ 18.04 శాతం (15,396) ఓటింగ్‌తో మూడో ప్లేసులో ఆకట్టుకున్నాడు.
చివరి స్థానంలో డ్యాన్సర్
మొన్నటివరకు టాప్‌లో కొనసాగిన యాంకర్ విష్ణుప్రియ నాలుగో స్థానానికి పడిపోయింది. విష్ణుప్రియ భీమనేనికి 12,215 ఓట్లతో 14.32 శాతం ఓటింగ్ నమోదు అయింది. వీరి తర్వాత ఆదిత్య 9.62 శాతం (8,201 ఓట్లు) ఓటింగ్‌తో ఐదో స్థానంలో ఉంటే.. 6.67 శాతం (5,689 ఓట్లు) ఓటింగ్‌తో ఢీ షో డ్యాన్సర్ నైనిక చివరి స్థానమైన ఆరో ప్లేసులో ఉంది.
ఇవాళే ఎలిమినేషన్ షూటింగ్
అంటే, ప్రస్తుతానికి ఆదిత్య ఓం, నైనిక ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక ఐదోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను బుధవారం (అక్టోబర్ 2) షూట్ చేసి గురువారం (అక్టోబర్ 3) టెలీకాస్ట్ చేయనున్నారు. అంటే, అతి తక్కువ ఓటింగ్ నమోదు అయిన నైనిక ఇవాళ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వీకెండ్ ఎలిమినేషన్‌లో అతను
ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో నైనిక మధ్యలోనే వెళ్లిపోనుందని సమాచారం. కాగా.. ఇలాగే ఓటింగ్ జరిగితే ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీకెండ్‌లో జరిగే రెగ్యులర్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఎలిమినేట్ కానున్నాడని టాక్ నడుస్తోంది. ఆదిత్య ఓం ఎలిమినేషన్‌ను శనివారం (అక్టోబర్ 5) నాడు ప్రకటించున్నారని సమాచారం.