Bigg Boss Vishnupriya: నీకెవరు లైన్ వేస్తారు- డైరెక్ట్‌గా అతని పరువు తీసేసిన విష్ణుప్రియ- హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై యాంకర్-bigg boss telugu 8 vishnupriya discussion on love tracks naga manikanta in bigg boss 8 telugu day 19 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vishnupriya: నీకెవరు లైన్ వేస్తారు- డైరెక్ట్‌గా అతని పరువు తీసేసిన విష్ణుప్రియ- హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై యాంకర్

Bigg Boss Vishnupriya: నీకెవరు లైన్ వేస్తారు- డైరెక్ట్‌గా అతని పరువు తీసేసిన విష్ణుప్రియ- హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై యాంకర్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Vishnupriya About Love Track: బిగ్ బాస్ తెలుగు 8లో లవ్ ట్రాక్స్‌పై, లవ్ చేయడంపై యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ చేసింది. నీకెవరు లైన్ వేస్తారంటూ ఓ కంటెస్టెంట్ పరువును డైరెక్ట్‌గా అతని ముందే తీసేసింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..

నీకెవరు లైన్ వేస్తారు- డైరెక్ట్‌గా అతని పరువు తీసేసిన విష్ణుప్రియ- హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై యాంకర్

Bigg Boss 8 Telugu Day 19 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్‌లో ప్రభావతి 2.0 టాస్క్ పూర్తి అయింది. ఈ టాస్క్‌లో అత్యధికంగా గుడ్లు సాధించిన నిఖిల్ క్లాన్ గెలిచింది. అలాగే, తన దగ్గర ఉన్న రెడ్ కలర్ ఎగ్‌ను తన టీమ్ క్లాన్‌లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నట్లో తర్వాత అడిగినప్పుడు చెప్పాల్సిందిగా తెలిపాడు బిగ్ బాస్.

చీఫ్ కంటెండర్స్

తను రెడ్ కలర్ గుడ్డు ఎవరికీ ఇస్తాడో వారు కూడా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అలాగే, ఓడిపోయిన అభయ్ క్లాన్ నుంచి ముగ్గురు చీఫ్ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందన్నాడు. అభయ్ మినహా మిగతావాళ్లకు ఆ ఛాన్స్ ఉందని తెలిపాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్ టీమ్ కాస్తా నిరాశపడింది.

బిగ్ బాస్ సీరియస్

అంత కష్టపడి గెలిస్తే మాలో ఒక్కరికేనా ఛాన్స్ అని పృథ్వీరాజ్, సీత అనుకున్నారు. తర్వాత తన రూల్స్‌ను, టాస్క్‌లను వ్యతిరేకించడంపై బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ సీరియస్ అయిన దాని గురించి కూడా అభయ్, ప్రేరణ, నబీల్ మిగతా వారు డిస్కషన్ పెట్టుకున్నారు. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లో పృథ్వీ దిగాడు. ఆ విషయం యష్మీ, ప్రేరణ, సీత, నైనికతో ఉన్న విష్ణుప్రియ చెప్పింది.

మిగతా వాళ్లందరికీ

వాళ్లతోపాటు విష్ణుప్రియ పక్కనే నాగ మణికంఠ కూడా ఉన్నాడు. పూల్‌లో దిగిన పృథ్వీని విష్ణుప్రియ చూసి చెప్పింది. అవి కళ్లా.. స్కానర్సారా అని మణికంఠ అన్నాడు. నేను పృథ్వీనే కాదు మిగతా వాళ్లకు లైన్ వేస్తున్నాను అని విష్ణుప్రియ అంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు అబ్బాయిలు అని సీత అంటే.. అప్పుడు ఎదురుగా ఉన్న యష్మీ, ప్రేరణలో ఒకరు నాగ మణికంఠ అని డౌట్‌గా చూపించారు.

నీకు పెళ్లి అయింది కదా

నీకెవరు లైన్ వేస్తారు. నీకు పెళ్లి అయింది కదా అని అతనితోనే చెప్పి డైరెక్ట్‌గా పరువు తీసేసింది విష్ణుప్రియ. దాంతో అంతా నవ్వేశారు. మణికంఠ కూడా నవ్వాడు. ఆదిత్య గారికి కూడా అని సీత సరదాగా అడిగింది. హా.. అవునే.. వేస్తున్నాను అని వెటకారంగా సమాధానం ఇచ్చింది విష్ణుప్రియ. ఆదిత్య ఓం గారి కళ్లు బాగుంటాయని, తనకు ఇష్టమని విష్ణుప్రియ చెప్పింది.

మళ్లీ హగ్ చేసుకుంటా

తర్వాత కాసేపటికి నువ్ హగ్ చేసుకున్నప్పటి నుంచి ప్రేమ మొదలైందన్నట్లుగా నాగ మణికంఠతో విష్ణుప్రియ చెప్పింది. దాంతో నిజమారా.. థ్యాంక్స్‌రా.. అయితే మళ్లీ హగ్ చేసుకుంటా అని ముందుకు వచ్చాడు మణికంఠ. దానికి ఛీ.. నో అనుకుంటూ లేచి నిల్చోని పక్కకు వెళ్లిపోయింది విష్ణుప్రియ. ఇలా హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై ఫన్నీగా కావాలనే డిస్కషన్ పెట్టింది విష్ణుప్రియ.

డేంజర్ జోన్‌లో ఇద్దరు

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది ఉన్నారు. వారిలో విష్ణుప్రియ, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, యష్మీ గౌడ, ప్రేరణ, నైనిక, పృథ్వీరాజ్‌తోపాటు సెల్ఫ్ నామినేట్ అయిన అభయ్ ఉన్నారు. వీరిలో ఎలిమినేషన్ అయ్యేందుకు ఎక్కువ డేంజర్ జోన్‌లో నైనిక, అభయ్ ఉన్నారు.