Bigg Boss Yashmi: వాడు చాలా డేంజరస్, ఈవారం ఎలిమినేట్ కావాలి.. నబీల్‌ది బక్వాస్ గేమ్.. సోనియాలా మారిన యష్మీ
Bigg Boss Telugu 8 Yashmi About Nabeel Game: బిగ్ బాస్ తెలుగు 8లో సోనియా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు హౌజ్‌లో సోనియా స్థానాన్ని యష్మీ భర్తీ చేసేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో నబీల్‌ది బక్వాస్ గేమ్ అంటూ కామెంట్స్ చేసింది. ఎపిసోడ్ హైలెట్స్‌లోకి వెళితే
Bigg Boss 8 Telugu October 1st Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సరికొత్త ట్విస్టులతో సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు నాలుగో వారం సోనియా ఆకుల ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా యష్మీ కనిపిస్తోంది.
టైమ్ వచ్చిందని
బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం సోనియాల యష్మీ ప్రవరిస్తోంది. ఒక్క గేమ్ విన్ అయి మిగిలినవాళ్ల గేమ్ చెత్త అంటూ కామెంట్స్ చేసింది. ఎపిసోడ్ ప్రారంభం కాగానే యష్మీతో ప్రేరణ మాట్లాడింది. "మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం వెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా?" అని ప్రేరణ అడిగింది.
గొప్ప ఫ్రెండ్ అనుకున్నావా
దానికి "అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటాడు. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాడు. ఎదుటివాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ నమ్మించి మోసం చేయడం, ఇదేం గేమ్‌రా. ఆయన్ను చూస్తూనే నాకు చాలా కోపం వస్తుంది" అని యష్మీ అంది. అప్పుడు "నువ్ నిజంగా వాడిని గొప్ప ఫ్రెండ్ అనుకున్నావా. ఇంత తక్కువ టైమ్‌లో అనుకున్నావా" అని ప్రేరణ అడిగింది.
క్రిమినల్ ఫేస్
"నమ్మానురా ఫ్రెండ్ అని పాపం. నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని. కానీ, చాలా డేంజరస్. క్రిమినల్ ఫేస్ ఉందని నేను అనుకోలేదు" అని నాగ మణికంఠపై యష్మీ కామెంట్స్ చేసింది. అనంతరం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ మళ్లీ పెట్టారు. వాటిలో జాగ్రత్తగా నడు.. లేకపోతే పడతావ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో నాగ మణికంఠ, యష్మీ ఆడారు. దీంట్లో యష్మీ గెలిచింది.
గెలిచిన ఆదిత్య
ఐదు వారాల ఇండువిజువల్ ఆటలో యష్మీ గెలిచింది ఇదే మొదటిసారి. దాంతో తెగ సంబరపడిపోయింది. కాస్తా ఓవరాక్షన్ కూడా చేసింది. ఆ తర్వాత మూడో ఛాలెంజ్‌లో రౌండ్‌గా తిరుగుతున్న టేబుల్‌పై నుంచి అటువైపు ఉన్న బాస్కెట్‌లో బాల్స్ వేయాలి. ఈ టాస్క్‌కి నబీల్, ఆదిత్య వచ్చారు. చాలా త్వరగా గేమ్ ఫినిష్ చేశాడు ఆదిత్య. దాంతో ఆదిత్య గెలిచాడు.
వాడికేమైనా పిచ్చా
ఈ గేమ్ తర్వాత కాంతార టీమ్ నుంచి ఒకరిని తొలగించాలని శక్తి టీమ్‌కు పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అప్పుడు నిఖిల్‌తో నబీల్ గురించి యష్మీ బ్యాడ్‌గా మాట్లాడింది. "అరేయ్ వాడికేమైనా పిచ్చా.. ఏం గేమ్ ఆడర్రా వాడు. గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబీల్. కానీ, ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్‌గా ఆడాడు. లాస్ట్ వీక్ మొత్తం వాడే ఆడాడు కదా" అని యష్మీ కామెంట్స్ చేసింది.
నబీల్‌కు హీరో ట్యాగ్
అయితే, గతవారం నాగార్జున ముందు బెస్ట్ గేమర్, హీరో అని నబీల్‌కు యష్మీ ట్యాగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు అలా పొగిడి.. ఇప్పుడు తాను ఒక గేమ్ గెలిచి.. నబీల్ ఓడిపోయేసరికి ఇలా నోరు పారేసుకుంది యష్మీ గౌడ. దీంతో హౌజ్‌లో మరో సోనియాల మారింది యష్మీ గౌడ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.