Bigg Boss Punishment: హౌజ్‌లో కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ పనిష్‌మెంట్.. నబీల్ పరిస్థితి మరి దారుణం! (వీడియో)
Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ పనిష్‌మెంట్ ఇచ్చాడు. వారిలో నబీల్ అఫ్రిది పరిస్థితి మరి దారుణంగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రచ్చ రంబోలా అన్నట్లుగా సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌ను మరోసారి కొనసాగించారు. ఇందులో భాగంగా మూడు టాస్క్‌లు పెడితే మొదటి దాంట్లో శక్తి, కాంతార రెండు క్లాన్స్ ఓడిపోయాయి. చివరి రెండు టాస్క్‌ల్లో శక్తి టీమ్ గెలిచింది.
మార్నింగ్ మస్తీ
దాంతో హౌజ్‌లోకి వచ్చే వైల్డ్ కార్డ్ మెంబర్స్ సంఖ్య 8కి చేరుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఇందులో కంటెస్టెంట్స్‌తో మార్నింగ్ మస్తీ పేరుతో ఓ గేమ్ ఆడించాడు. అందులో ఓడిపోయిన కంటెస్టెంట్స్‌కు పనిష్‌మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్.
"బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఓ మార్నింగ్ మస్తీ టాస్క్ ఇవ్వబోతున్నాడు. అదే కలర్.. కలర్.. విచ్ కలర్ డూ యూ వాంట్. నేను మీకో కలర్ చెబుతాను. ఆ కలర్‌ను మీ అపోనెంట్ కంటే ముందుగా తీసుకొచ్చి అక్కడున్న బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ చెప్పాడు. దానికి నబీల్ సూపర్ బిగ్ బాస్ అన్నాడు.
ఐటమ్ సాంగ్‌కు మణికంఠ డ్యాన్స్
ఆదిత్య, మణికంఠ పోటీ పడ్డారు. విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అని అడిగితే.. బ్లాక్ అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ముందుగా బాక్స్‌లో తన చెప్పు వేశాడు ఆదిత్య. అనంతరం ఓడిపోయిన వారికి ఏదైనా పనిష్‌మెంట్ ఇద్దామా అని బిగ్ బాస్ అడిగితే అంతే ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మంచి ఐటమ్ సాంగ్‌కు మణికంఠ డ్యాన్స్ చేయాలని ఆదిత్య ఓం చెప్పాడు.
దానికి సూపర్ మచ్చి పాటకో నాగ మణికంఠ అదిరిపోయేలా డ్యాన్స్ చేశాడు. తనతోపాడు నైనిక చేరి డ్యాన్స్ చేసింది. తర్వాత నబీల్, నిఖిల్ పోటీ పడ్డారు. బిగ్ బాస్ గ్రీన్ చెబితే.. గ్రౌండ్‍లో ఉన్న గడ్డి తీసుకొచ్చిన బాక్స్‌లో ముందుగా పెట్టాడు నిఖిల్. దాంతో నబీల్ ఓడిపోయాడు. "పూల్‌లో ఉన్న వాటర్‌ను బకెట్‌లో నింపాలి. కానీ, స్పూన్‌తో" అని బిగ్ బాస్ చెప్పాడు.
పాపం నబీల్
దాంతో ఒక్కసారిగా నబీల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. బిగ్ బాస్ చెప్పినట్లుగా స్పూన్‌తో వాటర్‌ను బకెట్‌లో నింపాడు నబీల్. పాపం అని నైనిక అనడం చూపించారు. తర్వాత సీత, యష్మీ పోటీ పడ్డారు. సీత గెలిచింది. యష్మీకి పనిష్‌మెంట్‌గా మణికంఠ అందాన్ని పొగడాల్సిందిగా చెప్పినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
"మణికంఠ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత క్రేజీ ఉంటదంటే.. అది చూసి రోజు నేను పడిపోతాను.. పకపకా.." అంటూ యష్మీ కామెడీ చేసింది. అనంతరం పృథ్వీ, ప్రేరణ పోటీ పడ్డారు. ప్రేరణ గెలిచింది. ఓడిపోయిన పృథ్వీ అమ్మాయిలా రెడీ అయి వాక్ చేయాలని సీత చెప్పింది. దాంతో గౌను వేసుకుని పృథ్వీ అమ్మాయిలా నడిచాడు. ఊ అంటావా మావ పాట ప్లే చేశారు.
లంగా ఎత్తిన పృథ్వీ
కింద కూర్చున్న నబీల్, నిఖిల్ దగ్గరికి వెళ్లిన పృథ్వీ లంగా (ఫ్రాక్) పైకి ఎత్తబోయాడు. అది చూసి నబీల్ పక్కకు తప్పుకున్నాడు. సీత, నైనిక చూడలేక తల పక్కకు తిప్పుకున్నారు. వీరందరిలో నబీల్‌కు ఇచ్చిన పనిష్‌మెంట్ కష్టంగా ఉండి అతని పరిస్థితి దారుణంగా అనిపించింది.