Brahmamudi Promo: అత్తింట్లో అడుగుపెట్టనున్న కావ్య - రుద్రాణిపై స్వప్న రివేంజ్ - అనామిక ఆనందం ఆవిరి
Brahmamudi Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో రాజ్, కావ్యలను ఎలాగైనా ఒక్కటి చేయాలని అపర్ణ అనుకుంటుంది. కావ్య తిరిగి దుగ్గిరాల ఇంటికి వస్తేనే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయని భావిస్తుంది. ఇంటికొచ్చి రాజ్‌తో బుద్దిగా కాపురం చేసుకోమని కావ్యకు సలహా ఇస్తుంది.
Brahmamudi Promo: ఎక్స్‌పో అవార్డుల విషయంలో కావ్య తనను మోసం చేసిందని రాజ్ భ్రమపడతాడు. తనను ఓడించడానికే అనామికతో కావ్య చేతులు కలిపిందని కోపంతో రగిలిపోతాడు. తన చెప్పుడు మాటలతో రాజ్ ఆవేశాన్ని మరింత పెంచుతుంది రుద్రాణి. రాజ్ ఎంత చెప్పిన అపర్ణ, ఇందిరాదేవి మాత్రం కావ్యను సమర్థిస్తూ వస్తారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టినందుకు నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి కావ్య దుగ్గిరాల కుటుంబానికి తీరని ద్రోహం చేసిందని రాజ్ కోపంగా అంటాడు.
కావ్య కన్నీళ్లు...
అనామిక కారణంగా చేయని తప్పుకు భర్త ముందు దోషిగా మారిన కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన వల్ల భర్తకు అవమానం జరగడం తట్టుకోలేకపోతుంది. అనామిక ట్రాప్ ఇదని భర్తకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంది. మరోవైపు కావ్య చేత రాజ్‌ను దెబ్బకొట్టిన అనామిక ఆనందంలో మునిగిపోతుంది.
రుద్రాణిపైస్వప్న రివేంజ్...
కావ్య, రాజ్ శత్రువులుగా మారిపోయారని, వారు జీవితంలో మళ్లీ కలిసే అవకాశం లేదని రుద్రాణి అనుకుంటుంది. దుగ్గిరాల కుటుంబం మొత్తం బాధలో ఉండటం చూసి ఆనందం పట్టలేక పార్టీ చేసుకుంటుంది. తన చెల్లెలు కాపురాన్ని కూల్చేసిన రుద్రాణికి బుద్ది చెప్పాలని స్వప్న ఫిక్సవుతుంది. రుద్రాణి ముఖంపై ముసుగుకప్పి చితక్కొడుతుంది. స్వప్న దెబ్బలకు రుద్రాణి నొప్పితో విలవిలలాడుతుంది. తాగింది మొత్తం దిగిపోయేలా కొట్టారంటూ బాధపడుతుంది.
కావ్య, రాజ్ ఒక్కటి కావాలంటే..
కావ్యపై రాజ్‌కు ఉన్న ద్వేషం తొలగిపోయి, వారిద్దరు ఒక్కటి కావాలంటే కోడలు తిరిగి ఇంటికి రావడం ఒక్కటే దారి అని అపర్ణ అనుకుంటుంది. కావ్యను రాజ్ తీసుకురావడానికి ఒప్పుకోడు కాబట్టి తానే కావ్య ఇంటికి రమ్మని అడగాలని అనుకుంటుంది. కావ్యను కనకం ఇంటిలో కాకుండా గుడిలో కలవాలని అనుకుంటుంది. అపర్ణ ప్లాన్‌ను రుద్రాణి కనిపెడుతుంది. కావ్యను అపర్ణ ఎక్కడ తీసుకొస్తుందోనని కంగారు పడుతుంది.
షాకిచ్చిన రుద్రాణి…
ఉదయం లేవగానే తల్లి కోసం ఇంట్లో వెతుకుతాడు రాజ్. కానీ అపర్ణ ఎక్కడ కనిపించదు. అమ్మ ఎక్కడికి వెళ్లిందని ఇందిరాదేవిని అడుగుతాడు. కావ్యను కలిసేందుకు అపర్ణ వెళ్లిందన్న సంగతి తెలిసి కూడా రాజ్ దగ్గర దాచిపెడుతుంది ఇందిరాదేవి. తనకు తెలియదని రాజ్‌కు సమాధానం చెబుతుంది. అక్కడే ఉన్న రుద్రాణి మాత్రం...
కావ్యను కలవడానికి మీ అమ్మ గుడికి వెళ్లిందని అసలు సంగతి బయటపెడుతుంది. ఆమె మాటలు వినగానే రాజ్ షాకవుతాడు. కోపం పట్టలేకపోతాడు. కావ్య ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదని అంటాడు.
గుడిలో కావ్యను కలిసి అపర్ణ...
గుడిలో కావ్యను కలుస్తుంది అపర్ణ. అనామిక చేసిన మోసం మొత్తాన్ని అత్తయ్యకు చెబుతుంది కావ్య. అనామిక గెలవడమే కాకుండా అటు కంపెనీని, ఇటు మీ కాపురాన్ని దెబ్బతీసిందని కావ్యతో అంటుంది అపర్ణ. ఇందులో తన తప్పేం లేదని ఎంత చెప్పిన రాజ్ నమ్మడం లేదని కావ్య ఆవేదనకు లోనవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.ఏం చెప్పి రాజ్‌ను నమ్మించాలో తనకు తెలియడం లేదని అంటుంది. రాజ్‌కు ఏం చెప్పక్కరలేదని, అతడిని నమ్మించాల్సిన పనిలేదని కావ్యతో అంటుంది అపర్ణ.
కావ్య ఇంటికొస్తుందా..?
తిరిగి మన ఇంటికొచ్చి రాజ్‌తో బుద్ధిగా కాపురం చేసుకోమని కోడలితో అపర్ణ చెప్పినట్లుగా బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. అపర్ణ ప్రపోజల్‌కు కావ్య ఒప్పుకుందా? తిరిగి అత్తింట్లో అడుగుపెట్టిందా? ఆమె రాజ్ ఇంట్లో అడుగుపెట్టనిచ్చాడా? లేదా? అన్నది సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.