Telugu Cinema News Live December 23, 2024: UI Movie OTT: ఉపేంద్ర క్రేజీ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే!
23 December 2024, 15:17 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- UI Movie OTT: యూఐ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందో తెలిసిపోయింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Telugu Web Series: ఈ ఏడాది తెలుగులో వచ్చిన హరికథ, బహిష్కరణతో పాలు పలు వెబ్‌సిరీస్‌లు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాయి. వచ్చే ఏడాది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. స్టార్స్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లు ఏవంటే?
- Sai Pallavi: సాయి పల్లవి కాశీలోని అన్నపూర్ణ దేవి ఆలయానికి వెళ్లింది. రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సీత పాత్ర పోషిస్తున్న ఆమె.. దాని కంటే ముందు ఆలయాలను సందర్శించే పనిలో ఉంది. ఈ మధ్యే రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. పాతాళ్ లోక్ 2 అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వె బ్‌సిరీస్‌లో జై దీప్ అహ్లవత్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
- Tollywood: ఇటీవల జరిగిన పరిణామాలతో సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకోనివ్వబోమనేలా తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దీంతో సంక్రాంతి సినిమాలకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై ఎదురైన ప్రశ్నకు నిర్మాత నాగవంశీ తాజాగా స్పందించారు.
- Malayalam Movie: మార్కో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా జోరుగా వస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Allu Arjun: సంధ్య థియేటర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఒకటి చెబుతుంటే పోలీసులు మరో మాట చెబుతోన్నారు. ఈ వివాదంపై సీఏం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సీఏం వ్యాఖ్యలపై తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ మీటింగ్ ఏర్పాటుచేయబోతున్నారు.
- OTT Horror Comedy: భూల్ భులయ్యా 3 సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవనుందంటే..
OTT: మలయాళం లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సూక్ష్మదర్శిని ఓటీటీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకున్నది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో యాభై ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లి చూపులు కావడంతో ప్రభావతి తెగ హడావిడి చేస్తుంది. మాటి మాటికి కోటీశ్వరుల సంబంధం అంటూ మురిసిపోతుంది. ఆమె హడావిడి చూసి బాలు, సత్యం సెటైర్లు వేస్తారు.
- Saripodhaa Sanivaaram Telecast: సరిపోదా శనివారం చిత్రం టీవీల్లోకి వచ్చేందుకు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి. త్వరలో అంటూ ఇంతకాలం ఊరించిన టీవీ ఛానెల్ ఇప్పుడు.. వివరాలను వెల్లడించింది.
Brahmamudi December 23rd Episode: బ్రహ్మముడి డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో బ్యాంకు సమస్యను కావ్య సాల్వ్ చేయడంతో రాజ్ సంబరపడిపోతాడు. కావ్యకు ఇంప్రెస్ అయిపోతాడు. దుగ్గిరాల ఇంట్లో కొత్త రూల్స్ పెడుతుంది కావ్య. ఇంట్లో వాళ్లు ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని ఆర్డర్ వేస్తుంది.
- Karthika Deepam 2 Today Episode December 23: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. ఇల్లు వదిలి బయటికి వచ్చేసిన కార్తీక్ ఫ్యామిలీ గుడికి వెళుతుంది. ఆ తర్వాత అద్దెకు ఇల్లు దొరికినా కార్తీక్‍కు డబ్బు ఇబ్బంది ఎదురవుతుంది. జ్యోత్స్నపై సుమిత్ర మరింత కోప్పడుతుంది. ఈ ఎపిసోడ్‍లో ఏం జరిగింతో పూర్తిగా ఇక్కడ చూడండి.
NNS Serial: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో మిస్సమ్మ తన చెల్లి అని, ఆమె జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తానని మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది. ఆరు వార్నింగ్‌ను మనోహరి పట్టించుకోదు. మిస్సమ్మను చంపేసి అమర్‌ను పెళ్లి చేసుకొని తీరుతానని ఆరుతో ఛాలెంజ్ చేస్తుంది మనోహరి.