Telugu Cinema News Live December 14, 2024: Rani Mukerji: ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్
14 December 2024, 10:57 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Rani Mukerji Dedicated Mardaani 3 To Police Officers: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మర్దానీ 3 షూటింగ్ ప్రారంభ నేపథ్యంలో ఆ మూవీని ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం ఇస్తున్నట్లుగా రాణి ముఖర్జీ చెప్పింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియన్ల మంది ఫాలో అవుతోన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కరినే ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కరు ఎవరంటే?
- Pushpa 2 The Rule 9 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ అరెస్ట్ సంఘటన ఇండియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, బన్నీ అరెస్ట్ నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్స్ ఆసక్తిగా మారాయి. 9వ రోజున ఇండియాలో పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ప్రణయ గోదారి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సాయికుమార్ కీలక పాత్ర పోషించాడు.
- Karthika Deepam 2 Today Episode December 14: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపపై తాము దాడి చేయించలేదని పారిజాతం గట్టిగా చెప్పడంతో కార్తీక్ కూడా అదే ఆలోచిస్తాడు. జ్యోత్స్న, పారిజాతంపై సుమిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
- Bachhala Malli Producer About Allari Naresh Ram Charan: రామ్ చరణ్‌కు రంగస్థలం సినిమా ఎలానే అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి మూవీ అని నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి ప్రమోషన్స్ సందర్భంగా ఇలా మాట్లాడారు.
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు ప్రోమోలో మీనా సెలిబ్రిటీగా మారడంతో బాలు ఆనందం పట్టలేకపోతాడు. ఈ సంతోషంలో స్నేహితులకు బార్‌లో పార్టీ ఇస్తాడు. అదే బార్‌లో ఉన్న సంజు...బాలు స్నేహితుడిని కొడతాడు. తన స్నేహితుడిని కొట్టిన సంజును బట్టలు ఊడదీసి అవమానిస్తాడు బాలు.
- Brahmamudi Serial December 14th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 14 ఎపిసోడ్‌లో సీతారామయ్య షూరిటీ పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, అందుకు వంద కోట్లు కట్టమంటూ రాజ్ దగ్గరికి బ్యాంక్ వాళ్లు వస్తారు. సంతకం చేసిన రాజ్ కంపెనీ, కుటుంబం అంతా రోడ్డుమీద పడుతుందా అని ఆలోచిస్తాడు.
Malayalam OTT: మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ పాలుమ్ పాళవుమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. సైనా ప్లే ఓటీటీ ద్వారా త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పాలుమ్ పాళవుమ్ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వీకే ప్రకాష్ దర్శకత్వం వహించాడు.
- Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 2 ఫైనలిస్ట్స్‌కు ఒక్కసారిగా ఓటింగ్ పెరగ్గా వారిలో ఎవరు విజేత అనేది పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. ఎందుకంటే యూట్యూబ్, మిగతా సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫలితాలు ఉన్నాయి.