Rani Mukerji: ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్-rani mukerji comments on mardaani 3 and dedicated to courageous police officers over mardaani 3 making video release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rani Mukerji: ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్

Rani Mukerji: ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 10:57 AM IST

Rani Mukerji Dedicated Mardaani 3 To Police Officers: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మర్దానీ 3 షూటింగ్ ప్రారంభ నేపథ్యంలో ఆ మూవీని ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం ఇస్తున్నట్లుగా రాణి ముఖర్జీ చెప్పింది.

ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్
ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కు అంకితం.. బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కామెంట్స్

Bollywood Heroine Rani Mukerji Comments: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త మూవీ మర్దానీ 3. హిందీ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం మర్దానీ ఫ్రాంఛైజీ నుంచి మర్దానీ 3 మూడో సినిమాగా రానుంది.

సూపర్ హిట్‌గా రెండు సినిమాలు

మర్దానీ సినిమా విడుద‌లై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుద‌లైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ మూవీస్‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాయి. అలాగే ఈ సినిమాల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది.

మేకింగ్ వీడియో రిలీజ్

నేటికి మ‌ర్దానీ2 రిలీజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా మ‌ర్దానీ3కి సంబంధించిన మేకింగ్ వీడియోను య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ విడుద‌ల చేసింది. ఇందులో రాణి ముఖ‌ర్జీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ శివానీ శివాజీ రాయ్ పాత్ర‌లో న‌టించారు. రాణి ముఖర్జీ గురించి మ‌న ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న మ‌ర్దానీ ఫ్రాంచైజీల‌ను ప్రేక్ష‌కుల‌కు ఎంతో గొప్ప‌గా ఆద‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అపరితమైన ప్రేమాభిమానాలు

ఈ సంద‌ర్భంగా రాణి ముఖ‌ర్జీ మాట్లాడుతూ "2025 ఏప్రిల్ నుంచి మ‌ర్దానీ3 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామ‌ని తెలియ‌జేయ‌టానికి ఎంతో సంతోషంగా ఉంది. పోలీస్ డ్రెస్ వేసుకుని ఓ అద్భుత‌మైన పాత్ర‌ను చేయ‌టం నాకెప్పుడూ ప్ర‌త్యేక‌మనే చెప్పాలి. ఈ పాత్ర‌ను చేయ‌టం ద్వారా మీ నుంచి నాకు అప‌రిమిత‌మైన ప్రేమాభిమానాలు ల‌భించాయి" అని తెలిపింది.

గత ఫ్రాంఛైజీలను మించేలా

"మ‌ర్దానీ3 సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతూ, డ్యూటీలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడ‌ని ధైర్య‌వంతులైన పోలీస్ ఆఫీస‌ర్స్‌కి ఈ సినిమా అంకితం. గ‌త ఫ్రాంఛైజీలను మించేలా మ‌ర్దానీ3లో గూస్‌బ‌ంప్స్ తెప్పించే గొప్ప స‌న్నివేశాలున్నాయి" అని రాణి ముఖర్జీ చెప్పుకొచ్చింది.

డార్క్, ఆడియెన్స్ ఆశ్చర్యపోయేలా

"మ‌ర్దానీ గ‌త ఫ్రాంచైజీలు ఎంతో పెద్ద హిట్స్‌గా నిలిచాయో అంద‌రికీ తెలిసిందే. వాటిని మించేలా స్క్రిప్ట్ ఉండాల‌ని వెయిట్ చేసి మ‌ర్దానీ3ని స్టార్ట్ చేస్తున్నాం. అది మా బాధ్య‌త‌. ఈ ఫ్రాంచైజీపై అంచ‌నాలుంటాయి. వాటిని అందుకునేలా సినిమా ఉండాలి. అలాగే డార్క్‌, ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయే అంశాల‌తో మర్దానీ ఉంటుంది" అని రాణి ముఖర్జీ పేర్కొంది.

రెండు టాలెంటెడ్ టీమ్స్

"నాకు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఆడియెన్స్ కూడా రేపు సినిమాను థియేట‌ర్స్‌లో చూసి అంతే ఎగ్జ‌యిట్‌మెంట్ ఫీల్ అవుతార‌ని భావిస్తున్నాను" అని రాణి ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా మ‌ర్దానీ3 కోసం నిర్మాత ఆదిత్య చోప్రా రెండు ప్ర‌తిభావంతులైన టీమ్స్‌ను ఒక్క‌టిగా ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అవే డైరెక్ష‌న్ టీమ్‌, రైటింగ్ టీమ్‌. ఈ ఫ్రాంచైజీ వార‌సత్వాన్ని వీరు ముందుకు వారు మరింత తీసుకెళతార‌ని ఆదిత్య చోప్రా భావిస్తున్నారు. రైల్వే మెన్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆయుష్ గుప్తా మ‌ర్దానీ 3 స్క్రిప్ట్‌ను అందించగా.. అభిరాజ్ మిన‌వాలా దర్శకత్వం వహిస్తున్నారు.

Whats_app_banner