Libido: శృంగార కోరికలు ఎక్కువగా వస్తున్నాయా? కారణాలు ఇవే!
Libido: కొందరిలో శృంగార కోరికలు ఎక్కువగా వస్తుంటాయి. ఎప్పుడూ అవే ఆలోచనలతో ఉంటారు. వాంఛ అధికంగా ఉంటుంది. అయితే, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి.
శృంగార కోరికలు ఉండడం సహజం. దాదాపు అందరికీ ఈ వాంఛలు ఉంటాయి. అయితే కొందరిలో మాత్రం శృంగార కోరికలు ఎక్కువగా పెరిగిపోతుంటాయి. ఎప్పుడూ అవే ఆలోచనలతో ఉంటారు. శృంగారం కోసం కాంక్ష అధికంగా ఉంటుంది. దీనికి కొన్ని విషయాలు కారణవుతాయి. అవేవో ఇక్కడ చూడండి.
హార్మోన్ల మార్పులు
హార్మోన్ల మార్పుల వల్ల ఎక్కువగా కోరికలు పెరుగుతుంది. జీవితంలోని వివిధ దశల్లో హార్మోన్ల లెవెల్స్ డిఫెరెంట్‍గా ఉంటాయి. ముఖ్యంగా యుక్త వయసులోకి అడుగుపెడుతున్న సమయంలో హార్మోన్ల స్థాయిల్లో ఎక్కువగా ఛేంజెస్ ఉంటాయి. హార్మోన్లలో మార్పుతో శృంగార కోరికలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుదలతో వాంఛ ఎక్కువవుతుంది.
రుతు క్రమంలో..
రుతుక్రమంలో ఈస్ట్రోజెన్, ప్రోసోజెన్ హార్మోన్లలో మార్పులు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువవడం, తక్కువవడం లాంటి అసమతుల్యతలు ఉంటాయి. దీనివల్ల కూడా ఆ సమయంలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఇది పాజిటివ్ సంకేతమే.
కొన్ని ఆహారాల వల్ల..
కొన్ని ఆహారాల వల్ల కూడా శరీరంలో లైంగిక కోరికలు పెరుగుతాయి. ఇది వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. అవకాడో, బ్రకోలీ, మామిడి, బాదం, పిస్తాలు లాంటి తిన్నప్పుడు శృంగార కోరిక పెరుగుతుంది. ఇవి వాంఛను పెంచగలవు.
కొత్తగా రిలేషన్‍లో ఉంటే..
కొత్తగా రిలేషన్ మొదులుపెట్టినప్పుడు చాలా మందికి ఎగ్జైటింగ్‍గా ఉంటుంది. పార్ట్‌నర్‌తో శృంగారం చేయాలనే కోరిక అధికంగా ఉంటుంది. దీంతో ఎప్పుడూ ఆవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇద్దరం మళ్లీ ఎప్పుడు కలుస్తామా.. ఎలా ఉంటుందా అనే ఉత్సాహం సాగుతుంటుంది.
ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకున్నప్పుడు..
ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల శరీరంలో హార్మోన్లు గతి తప్పుతాయి. తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇవి తీసుకున్న తర్వాత రిలాక్స్‌గా ఫీల్ అయితే.. అప్పుడు మూడ్‍లోకి వెళతారు. శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతాయి. నచ్చే మనుషులకు ఫీలింగ్స్ చెప్పేస్తారు. లైంగిక వాంఛ పెరుగుతుంది.
హైపర్‌సెక్సువాలిటీ
హైపర్‌సెక్సువాలిటీ, సెక్స్ అడిక్షన్ అనేవి మానసిక సమస్యలుగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కచ్చితంగా వైద్య సాయం తీసుకోవాలి. ఈ సమస్యలు ఉంటే ఎప్పుడూ లైంగిక వాంఛలు ఉంటాయి. కొన్ని రిలేషన్స్ దూరమయ్యే అవకాశం ఉంటుంది. సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సమస్యలు ఉంటే నిపుణుల సలహాలను తీసుకొని.. హైపర్‌సెక్సువాలిటీ తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.